భారత యువతరం క్రికెటర్ కరుణ్ నాయర్ సరికొత్త రికార్డు సృష్టించాడు. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న చివరి, ఐదవ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో కరుణ్ నాయర్ అరుదైన ఘనత సాధించాడు. ఈ క్రమంలో కెరీర్ లో తొలి సెంచరీ నమోదు చేసిన నాయర్ డబుల్ సెంచరీతో పాటు ట్రిపుల్ సెంచరీ కూడా సాధించి సత్తాచాటాడు. తొలి శతకాన్ని ట్రిపుల్ శతకంగా మార్చిన రెండో క్రికెటర్ గా కూడా తన పేరును నమోదు చేసుకన్నాడు నాయర్.
ఒక మ్యాచ్ లో పిఫ్త్ డౌన్ (ఐదవ స్థానం) లేదా ఆ తరువాత డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోరును సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ మ్యాచ్ లో నాయర్ 225 పరుగుల వ్యక్తిగత పరుగులను దాటిన క్రమంలో ధోని రికార్డును బ్రేక్ చేశాడు. 2013లో ఆస్ట్రేలియాపై ధోని 224 పరుగులను సాధించాడు. ఇదే ఇప్పటివరకూ ఐదు అంతకంటే తక్కువ స్థానాల్లో వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రికార్డుగా ఉంది. దీన్ని నాయర్ తాజాగా సవరించాడు.
మరొకవైపు తొలి సెంచరీని డబుల్ సెంచరీగా మార్చిన మూడో భారత ఆటగాడిగా నాయర్ నిలిచాడు. గతంలో దిలీప్ సర్దేశాయ్(200 నాటౌట్;న్యూజిలాండ్ పై1965లో), వినోద్ కాంబ్లి(224; ఇంగ్లండ్ పై 1993లో) ఈ ఘనత సాధించారు. ఇంగ్లండ్ తో ఐదో టెస్టు ద్వారా మొదటి సెంచరీని నాయర్ సాధించగా, దాన్ని డబుల్ గా మార్చుకున్నాడు. రోహిత్ శర్మ గాయంతో ఇంగ్లండ్ తో మూడో టెస్టులో నాయర్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. గత మ్యాచ్ ల్లో ఘోరంగా విఫలమైన నాయర్.. ఈ మ్యాచ్ లో పరుగుల దాహంతో చెలరేగిపోయాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more