దేశవాళీ క్రికెట్ లీగ్‌లో ఫిక్సింగ్ కు పాల్పడినట్లు అభియోగాలు ఎదర్కోన్న దక్షిణాప్రికా మాజీ క్రికెటర్ అల్విరో పీటర్సన్పై ఎట్టకేలకు నిషేధం వేటు పడింది. పీటరన్స్ ను దోషిగా తేల్చిన దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు.. అతనిపై రెండేళ్ల నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది. 2014-15 సీజన్లో జరిగిన దేశవాళీ క్రికెట్ లీగ్‌లో ఫిక్సింగ్ కు పాల్పడినట్టు నిర్ధారించిన బోర్డు అతనిపై వేటు వేసింది. ఈ మేరకు పీటర్సన్ పై దర్యాప్తు ముగిసిన తరువాత అతను మ్యాచ్ ఫిక్సర్ గా పేర్కొంటూ నిషేధం విధించింది. ఈ మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో నిషేధానికి గురైన ఆరో క్రికెటర్ పీటర్సన్.
2015 రామ్ స్లామ్ టోర్నీలో పలువురు క్రికెటర్లు మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డారు. ఆ ఫిక్సింగ్ ఉదంతానికి సంబంధించి మిగతా క్రికెటర్లపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టనున్నట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ పేర్కొంది. 2000వ సంవత్సరంలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ హాన్సీ క్రానే ఫిక్సింగ్ కు కేసులో నిషేధం ఎదుర్కొన్న తరువాత మరొక అత్యున్నత ప్రొఫెల్ కల్గిన దక్షిణాఫ్రికా క్రికెటర్ పై నిషేధం పడటం ఇదే తొలిసారి.
ప్రస్తుతం పీటర్సన్ వయసు 36 ఏళ్ల కావడంతో అతని అంతర్జాతీయ కెరీర్ దాదాపు ముగిసిపోయినట్లేనని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. రెండేళ్ల పాటు నిషేదం తరువాత అతని వయస్సు 40 ఏళ్లకు చేరుకోనున్న నేపథ్యంలో ఆయనకు నిషేధం వేటు జట్టు నుంచి వెళ్లిపోయేందుకు ఫెయిర్ వెల్ గా మారిందని కూడా క్రీడా విశ్లేషకులు ఎద్దేవా చేశారు. తాజాగా రెండేళ్ల పాటు నిషేధానికి గురైన అల్విరో పీటర్సన్.. దక్షిణాఫ్రికా తరపున 36 టెస్టు మ్యాచ్‌లు ఆడి ప్రస్తుతం నిషేధం వేటుకు గురయ్యాడు
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more