హార్థిక్ పాండ్యా.. అదృష్టమంటే ఇదేరా..! Visitors Test The Waters Against Hardik Pandya ...

Hardik pandya led india a to test australia in three day tour game

india a vs australia, india a vs australia warm-up game, india a vs australia warm up, ind a vs aus 2017 warm up, australia, india vs australia test 2017, hardik pandya, steve smith, cricket news, cricket

Hardik Pandya will be captaining the India A side which takes on Australia in a three-day warm-up match at the Brabourne Stadium in Mumbai from Friday.

హార్థిక్ పాండ్యా.. అదృష్టమంటే ఇదేరా..!

Posted: 02/16/2017 08:50 PM IST
Hardik pandya led india a to test australia in three day tour game

భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టు టీమిండియాతో సిరీస్ ను ప్రారంభించేందుకు ముందు మూడు రోజుల పాటు జరగనున్న వార్మప్ మ్యాచ్‌లో ఆడనుంది. అయితే ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ జట్టు తరుపున కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా వ్యవహరించనున్నాడు. ఇందులో భారత ఏ జట్టు రంగంలోకి దిగుతుండగా ఆస్ట్రేలియా మాత్రం తన అసలు జట్టుతోనే ఆడుతుంది. బహుశా ఆసిస్ జట్టు భారత పిచ్‌లపై అవగాహన కోసం ఇలాంటి నిర్ణయం తీసుకునివుంటుందని అంటున్నారు క్రీడావిశ్లేషకులు.

అయితే తమ ఆటగాళ్లకు కొంత విశ్రాంతిని ఇవ్వాలని జట్టు యాజమాన్యం లేదా జట్టు కెప్టెన్ భావించినా.. అందులో కొందరికి మాత్రం విరామం లభించే అవకాశం వుంటుందని అంటున్నారు. ఒకవేళ విశ్రాంతిని కల్పించే సమయంలో అసీస్ జట్టులో కూడా మార్పులు చోటుచేసుకునే అవకాశముంటుందని అంటున్నారు. అయితే ఆస్ట్రేలియా వంటి జట్టుపై ఆడితే మాత్రం భారత ఏ జట్టుకు మంచి అనుభవం దక్కనుంది. ఫిబ్రవరి 23 నుంచి మొదటి టెస్ట్ మ్యాచ్ మొదలుకానుంది.
 
వార్మప్ మ్యాచ్‌కు ఇరు జట్లు..
భారత జట్టు: హార్ధిక్ పాండ్యా(కెప్టెన్), అఖిల్ హెర్వడ్కర్, ప్రియాంక్ కీర్తి పంచల్, శ్రేయాస్ అయ్యర్, అంకిత్ బవ్నే, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సెహబాజ్ నదీమ్, క్రిష్ణప్ప గౌతమ్, కుల్దీప్ యాదవ్, నవ్‌దీప్ సైనీ, అశోక్ దిండా, మహ్మద్ సిరాజ్, రాహుల్ సింగ్, ఇంద్రజిత్.
 
ఆస్ట్రేలియా జట్టు: స్టీవ్ స్మిత్(కెప్టెన్). డేవిడ్ వార్నర్, అష్టోన్ అగర్, జాక్సన్ బర్డ్, పీటర్ హ్యాండ్స్‌కాంబ్, జోష్ హజల్‌వుడ్, ఉస్మాన్ కవాజా, నాథన్ లియాన్, మిచెల్ మార్ష్, షాన్ మార్ష్, గ్లేన్ మాక్స్‌వెల్, స్టీఫెన్ ఓకీఫ్, మాథ్యూ రెన్షా, మిచెల్ స్టార్క్, మిచెల్ స్వెప్సన్, మాథ్యూ వేడ్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : india vs australia  team india  Australia  Hardik Pandya  Steven Smith  Mumbai  cricket  sports news  cricket  

Other Articles