సరిగ్గా ఏడేళ్ల క్రితం అనగా 2010 ఫిబ్రవరి 24వ తేదీ.. సచిన్ టెండూల్కర్‌కు, భారత క్రికెట్ అభిమానులకు ప్రత్యేకమైన రోజు. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో తొలి డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా సచిన్ అరుదైన రికార్డు సృష్టించింది ఈ రోజే. గ్వాలియర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో సచిన్ ఈ ఫీట్ నమోదు చేశాడు. సచిన్ (200 నాటౌట్) అజేయ డబుల్ సెంచరీ బాదడంతో, టీమిండియా (401/3) భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించగా.. సచిన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. డబుల్ సెంచరీ చేశాక ఆ రోజు రాత్రి సచిన్ సరిగా నిద్రపోలేదట. సంతోషంతో అభినందనలు అందుకుంటూ గడిపాడు.
'మ్యాచ్ ముగిశాక హోటల్‌కు వచ్చాక అలసటగా అనిపించినా, సంతోషంతో నిద్ర రాలేదు. బెడ్‌పై మెళుకవతో గడిపాను. నా ఫోన్ చూస్తే మెసేజ్ బాక్స్ అభినందనల సందేశాలతో నిండిపోయింది. నాకు అభినందనలు తెలిపిన వారికి రిప్లే ఇస్తూ రెండు గంటలు గడిపాను. ఆ రోజు రాత్రి సరిగా నిద్రపోలేదు' అని సచిన్ తన ఆత్మకథ 'ప్లేయింగ్ ఇట్ మై వే'లో రాసుకున్నాడు. సచిన్ తర్వాత రోహిత్ శర్మ, మార్టిన్ గుప్టిల్, వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్ వన్డేల్లో డబుల్ సెంచరీలు చేశారు. రోహిత్ రెండుసార్లు డబుల్ సెంచరీలు బాదడం విశేషం.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more