మ్యాచ్ ఫిక్సింగ్ ల గురించి మాత్రమే తెలిసిన భారత క్రికెట్ అభిమానులకు స్పాట్ ఫిక్సింగ్ లు కూడా జరుగుతాయని తెలియజేప్పిన కేరళ స్పీడస్టర్ శ్రీశాంత్.. బీసీసీఐ నుంచి జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఐఫీఎల్ లో భాగంగా ఆయన ఈ అక్రమాలకు పాల్పడినట్లు అభియోగాలను ఎదర్కోంటుండగా.. న్యాయస్థానం మాత్రం అయన అక్రమాలకు సంబంధించిన సాక్ష్యాధారాలు లేవని నిర్ధోషిగా విడుదల చేసింది. దీంతో ఇటీవల తనపై నిషేధం ఎత్తివేయాలని బీసీసీఐ కొత్త పరిపాలన కమిటికీ లేఖ రాసిన శ్రీశాంత్ కు అక్కడ నిరాశే ఎదురుకావడంతో తాజాగా కేరళ హైకోర్టును ఆశ్రయించాడు.
తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని బీసీసీఐ ఎత్తివేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కేరళ హైకోర్టుకు విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. స్కాట్లాండ్ లీగ్ తరపున ఆడేందుకు శ్రీశాంత్ ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో అతనికి క్లియరెన్స్ లభించాల్సి ఉంది. ఏప్రిల్ తొలి వారంలో స్కాట్లాండ్ ప్రీమియర్ లీగ్ ఆరంభం కానున్నతరుణంలో తనకు ఎన్ఓసీ కావాలంటూ బీసీసీఐకి శ్రీశాంత్ విన్నవించాడు. అయితే దీనికి బీసీసీఐ నిరాకరించడంతో శ్రీశాంత్ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాడు. దీనిలో భాగంగా కేరళ హైకోర్టును శ్రీశాంత్ ఆశ్రయించాడు.
2013లో శ్రీశాంత్ పై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో అతనిపై జీవితకాలం నిషేధం విధిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అయితే 2015లో అతడు ఏ తప్పు చేయలేదంటూ ఢిల్లీ కోర్టులో క్లీన్చిట్ లభించింది. కాగా, అతనికి కోర్టు నుంచి క్లీన్ చిట్ లభించినా,బీసీసీఐ పెద్దలు మాత్రం అతనిపై నిషేధాన్ని కొనసాగిస్తున్నారు. దీనిలో భాగంగా పలుమార్లు బీసీసీఐకి శ్రీశాంత్ విజ్ఞప్తి చేసి విఫలమయ్యాడు. కొన్ని రోజుల క్రితం బీసీసీఐ పాలన వ్యవహారాలను చూస్తున్న వినోద్ రాయ్ కు శ్రీశాంత్ ఓ లేఖ రాసినా ఉపయోగం లేకుండా పోయింది. దాంతో శ్రీశాంత్ కోర్టు మెట్లెక్కాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more