టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ధోనీపై దాఖలైన క్రిమినల్ కేసు సంబంధించిన పిటీషన్‌ను కొట్టివేస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం కేసులో జార్ఖండ్ డైనమైట్ తప్పిదమేమీ లేదని తేల్చిచెప్పింది. ఈ కేసులో ధోని ఎవరి మత వివ్వాసాలకు భంగం కల్గించలేదని పేర్కోంది
2013, ఏప్రిల్‌లో బిజినెస్ టుడే మేగజైన్ కవర్‌పై విష్ణుమూర్తి ఆకారంలో ధోని ముఖచిత్రం ప్రచురితమైంది. దీంట్లో ధోని చేతుల్లో తను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న వస్తువులతో పాటు షూస్‌ను కూడా ఉంచారు. ఈ ఫొటో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూ అప్పట్లో అనంతపురం జిల్లా కోర్టులో కేసు వేశారు. బెంగళూరు కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. ఆ తర్వాత ఈ కేసు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు వెళ్లింది.
ఈ ఫొటో వివాదంలో ధోనీ ప్రమేయం లేదని కేసును కొట్టివేయాల్సిందిగా అతని తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం కోర్టు తీర్పు వెలువరిస్తూ.. ధోనీ ఉద్దేశపూర్వకంగా లేదా కించపరచాలనే భావనతో చేయలేదని పేర్కొంటూ కేసును కొట్టివేసింది. కెరీర్ పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ధోనీకి ఈ కేసు నుంచి ఉపశమనం లభించడం ఊరట కలిగిస్తోంది. దీంతో ఈ కేసు విషయంలోనే ఇబ్బందులను ఎదుర్కోంటున్న ధోని దాని ప్రభావంతోనే అటపై కూడా అసక్తి కనబర్చలేదన్న వాదనలు వినిపించాయి. దీంతో ఇక ధోని తన తడాఖా చూపెడుతాడని అభిమానులు అశగా ఎదురుచూస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more