AB de Villiers Leaves RCB to Return Home to Family మరో సమరానికి సిద్దమవుతాం: ఏబీ డివిలియర్స్..

Ab de villiers leaves rcb to return home to family

AB de Villiers, chris gayle, Indian Premier League, IPL 10, IPL 2017, RCB, Royal Challengers Bangalore, virat kohli, latest sports news, indian cricket team, news, sports, cricket news, cricket

Even though RCB are set to play another game in this edition of the IPL, star batsman AB de Villiers has returned home to spend time with his family ahead of the Champions Trophy.

మరో సమరానికి సిద్దమవుతాం: ఏబీ డివిలియర్స్..

Posted: 05/09/2017 06:26 PM IST
Ab de villiers leaves rcb to return home to family

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్ లో పటిష్టమైన జట్టుగా ముద్రపడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ఘోరంగా విఫలమై అభిమానుల ఆశలను అడియాశలు చేసింది. ఈ సీజ్ లో ఇప్పటివరకు 13 మ్యాచ్ లు ఆడిన బెంగళూరు జట్టు పది మ్యాచ్ లలో పరాజయం పాలై కేవలం రెండు మ్యాచ్ లలో మాత్రమే గెలుపోందింది. అయితే ఇక ఎన్ని ప్రయత్నాలు చేసినా బెంగళూరు జట్టు ప్లే ఆఫ్ లలోకి వెళ్లడం అన్నది జరగని పని అని తెలుసుకున్న ఆ జట్టు బ్యాట్స్ మెన్ ఏబి డీవిలయర్స్.. స్వదేశానికి పయనమయ్యాడు.

అయితే ఐపీఎల్ పదో సీజన్ లో మరో మ్యాచ్ మిగిలివుండగానే తనకు లభించే కొద్ది రోజులను తన కుటుంబంతో గడిపేందుకు దక్షిణాప్రికాకు వెళ్లాడు. ఆ తరువాత ఐసీసీ ఛాంఫియన్స్ ట్రోఫిలో తమ దేశ జట్టు తరపున బరిలోకి దిగేందుకు తన జట్టుకు ఆధ్వర్యంలో సిద్దం కానున్నాడు. అయితే సౌతాఫ్రికాకు చేరుకోగానే తానే స్వయంగా ట్విట్టర్ ద్వారా విషయాన్ని రాయల్ చాలెంజర్స్ అభిమానులకు తెలిపాడు.

ఈ సందర్భంగా పదో సీజన్ లో కొన్ని కఠినమైన పాఠాలను నేర్చుకున్నామని చెప్పిన డివీలయర్స్, రానున్న ఐపీఎల్ లో సమరానికి సిద్దమవుతామని పేర్కోన్నాడు. తమ టీమ్ ప్రదర్శన అసంతృప్తికి గురిచేసిందని పేర్కొన్నాడు. కాగా, 2008లో ఐపీఎల్ ఆరంభం నుంచి ఇప్పటికి వరకు జరిగిన పది సీజన్లలో మూడు పర్యాయాలు ఫైనల్స్ వరకు చేరిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మునుపెన్నడూ లేనట్టుగా ఈ సారి వైఫల్యం చెందింది. క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, డివిలియర్స్ వంటి దిగ్గజ బ్యాట్స్ మెన్లు ఉన్నప్పటికీ పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో నిలిచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AB de Villiers  chris gayle  virat kohli  IPL 10  IPL 2017  RCB  Royal Challengers Bangalore  cricket  

Other Articles