Junaid Khan Takes a Dig at Virat Kohli జూన్ 4న కూడా నా ముందు కోహ్లీ నిలబడలేడు

Junaid khan takes a dig at virat kohli ahead of indo pak clash

junaid khan, virat kohli, champions trophy, Team India, Pakistan, Champions trophy, champions trophy 2017, India vs Pakistan, junaid, Junaid Khan, Kohli, cricket

Pakistan speedster Junaid Khan has targeted skipper Virat Kohli and said that his team is not afraid of the Indian swashbuckling batsman and they know how to tackle him.

జూన్ 4న కూడా నా ముందు కోహ్లీ నిలబడలేడు

Posted: 05/28/2017 01:40 PM IST
Junaid khan takes a dig at virat kohli ahead of indo pak clash

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రతిభను యావత్ ప్రపంచ క్రికెట్ దిగ్గజాలు ప్రశంసించి, అభినందలతో ముంచెత్తుతున్న తరుణంలో.. దయాధి పాకిస్థాన్ దేశానికి చెందిన పేసర్ మాత్రం కోహ్లీ తన బౌలింగ్‌ ధాటికి నిలబడలేడని అన్నాడు. ఇంతకీ ఎవరతను అంటున్నారా.. అతనే జునైద్ ఖాన్. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో జునైద్‌ పై విధంగా స్పందించాడు. కోహ్లీ తనను ఎదుర్కొన్న నాలుగు మ్యాచ్‌ల్లో మూడుసార్లు ఔటైన విషయాన్ని ప్రస్తావించాడు.

చాంపియన్స్ ట్రోఫీలో కూడా ఇదే పునరావృతం అవుతుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. 'వాస్తవానికి కోహ్లీ గొప్ప బ్యాట్స్‌మనే.. కానీ, నా వద్దకు వచ్చే సరికి అతని ఎత్తులు పారడం లేదు' అని అన్నాడు. కోహ్లీ కంటే తాను మానసికంగా బలంగా ఉన్నానని చెప్పాడు. కాగా, కోహ్లీ, జునైద్‌ను ఎదుర్కొని నాలుగు సంవత్సరాలు అవుతోంది. ఎడమ చేతి వాటం గల ఈ పేసర్‌ అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : junaid khan  virat kohli  champions trophy  Team India  Pakistan  cricket  

Other Articles