ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఢిపెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగుతున్న టీమిండియా ఈ సారి కూడా ట్రోఫీని నిలిపుకోవాలని యావత్ భారత అభిమానులు కోరుకుంటున్న వేళ.. ఓపెనర్ అజింక్య రహానే ఫామ్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రోఫీ ప్రాక్టీస్ మ్యాచ్ లలో విఫలమవుతున్న టీమిండియా ఓపెనర్ బ్యాట్స్ మెన్ రహానే అంతగా రాణించలేక పోతుండటంతో భారత క్రికెట్ అభిమానుల్లో అగ్రహం కట్టలు తెంచుకుంటుంది. దీంతో ఆయనపై ట్విటరైట్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇప్పటిదాకా న్యూజీలాండ్, బంగ్లాదేశ్ లతో జరిగిన రెండు వార్మప్ మ్యాచ్ లలోనూ రహానే విఫలమయ్యాడు. న్యూజిలాండ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలోకి దిగి నిరాశపరిచాడు. కాగా నిన్న బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా బ్యాట్ ఎత్తేశాడు. ముస్తాఫిజర్ బౌలింగ్ లో డ్రైవ్ షాట్ ఆడబోయి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ నేపథ్యంలో రహానే ఫామ్ ను తీవ్రంగా అక్షేపిస్తున్న నెట్ జనులు ఆయన తీరుపై మండిపడుతున్నారు.
అత్యంత కీలకమైన టోర్నీకి ముందు ఇంత చెత్తగా ఆడితే ఎలా అంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఇక మరికోందరు మాత్రం ట్రోర్నీ విషయాన్ని పక్కనపెడితే దాయాధి పాకిస్తాన్ తో జూన్ 4వ తేదీన జరిగే మ్యాచ్ లో రహానే వికెట్ ఏమాత్రం కష్టపడకుండానే వారి ఖాతాలోకి వెళ్లిపోతుందని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక టోర్నీలో కూడా రహానే ఏ మేరకు రాణిస్తాడనే డౌట్ అభిమానుల్లో నెలకొంది. ఈ క్రమంలో, పాక్ తో జరిగే కీలకమైన మ్యాచ్ కు రహానేను ఎంపిక చేయద్దని క్రికెట్ అభిమానులు చెబుతున్నారు. ఇండియాకు వచ్చి డొమెస్టిక్ క్రికెట్ ఆడుకోవాలంటూ రహానేపై ట్విట్టర్ లో విరుచుకుపడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more