టీమిండియా ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో అతడి సేవలను కొనసాగించాలా..? లేక మరోకరిని ఆ స్థానంలో తీసుకోవాలన్న అన్న డైలిమాలో ఎటు తేల్చుకోలేకపోయినా.. అటు కోచ్ పదవికి అర్హులైన వారు ధరఖాస్తు చేసుకోవాలని మాత్రం ప్రకటనను ఇప్పటికే జారీ చేసింది బిసిసిఐ. అనిల్ కుంబ్లే సేవలను ఈ నెల 20తో ముగియనుండటం.. దానికి తోడు ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ముగిసి ఆ తరువాత మరిన్ని పోటీలకు భారత్ సిద్దం కానుండటంతో.. బిసిసిఐ ఇక సభ్యుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకుంది.
ఈ నేపథ్యంలో జట్టు సభ్యుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు బోర్డు తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి, జట్టు మేనేజర్ ఎంవీ శ్రీధర్, క్రికెట్ సలహా మండలి సభ్యుడు గంగూలీ పలు దఫాలుగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆటగాళ్లు కుంబ్లే పర్యవేక్షణపై ఆరోపణలు గుప్పించారు. ప్రాక్టీస్ సెషన్ ఎగ్గొట్టడాన్ని ఏమాత్రం సహించడని, ప్రాక్టీస్ లో దెబ్బలు తగిలినా పట్టించుకోడని, ప్రాక్టీస్ చేయాల్సిందేనని చెబుతాడని, ఆ సమయంలో మానవత్వం మరచి, రాక్షసుడిలా వ్యవహరిస్తాడని ఫిర్యాదు చేశారు. సుమారు 10 మంది ఆటగాళ్లు ఇదే రకమైన ఫిర్యాదు చేశారని తెలుస్తోంది.
రవిశాస్త్రి అలా కాదని, ఆటగాళ్లతో స్నేహంగా, సరదాగా ఉండేవాడని వారు చెప్పారు. దీనిపై సీనియర్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. కుంబ్లే అలా ఉండడం వల్లే జట్టు విజయాల పరంపర కొనసాగిస్తోందని, జట్టు పట్ల కోచ్ కఠినంగా ఉండాల్సి ఉంటుందని, అలా ఉంటేనే సానుకూల ఫలితాలు వస్తాయని, లేని పక్షంలో జట్టు పరాజయాల బాట పట్టే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. ప్రాక్టీసే కదా అని కోచ్ అలసత్వం ప్రదర్శిస్తే... ఫలితం కూడా అలానే ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more