ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఢిపెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగిన టీమిండియా.. గ్రూప్ బి నుంచి సెమీ ఫైనల్స్ కు చేరింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో ఓటమిని చవిచూసిన విరాట్ సేన.. బ్యాటింగ్, బౌలింగ్ సహా అన్ ఫీల్డ్ మూడు విభాగాల్లో సమీష్టిగా రాణించి సఫారీలను ఇంటికి పంపించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన చావో రేవో మ్యాచ్ లో అదరగొట్టిన విరాట్ సేన సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. 'నాకౌట్' పోరులో సఫారీలను చిత్తు చేసిన భారత్.. ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా.. ముందుగా తడబాటుకు గురైనా.. ఆ తరువాత వేగంగా కొలుకుంది. పటిష్ట స్థితిలో వున్న సఫారీలు 300 పైచిలుకు పరుగులు చేయడం గ్యారంటీ అని భావిస్తున్న తరుణంలో వారికి మరో ఐదు ఓవర్లు మిగిలివుండగానే కేవలం 191 పరుగులకే అలౌట్ చేసింది. ఓపెనర్లు డీకాక్, అమ్లాలు దక్షిణాప్రికా ఇన్నింగ్స్ ను నిలకడగానే ప్రారంభించారు. అయితే అమ్లాను అశ్విన్ ఔట్ చేసిన తరువాత డీకాక్ 116 పరుగుల వద్ద వెనుదిరిగాడు. అక్కడి నుంచి స్కోరును పెంచే క్రమంలో సఫారీలు వరుసగా వికెట్లు కోల్పోయారు. ఫలితంగా 191లకే అంతా చాపచుట్టేశారు.
అనంతరం బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్ ను అదిలోనే కోల్పోగా. అ తరువాత బరిలోకి దిగిన కెప్టెన్ విరాట్ తో కలసిన శిఖర్ ధావన్ నిలకడగా రాణిస్తూ.. భారత్ ను విజయతీరాలకు చేర్చడంలో దోహదపడ్డాడు. శిఖర్ ధావన్ 78 పరుగుల వద్ద వెనుదిరుగగా, కోహ్లీతో జతకలసిన యువరాజ్ సింగ్ సిక్సర్ తో విన్నింగ్ షాట్ కోట్టి టీమిండియాను గెలిపించాడు. విరాట్ కోహ్లీ అద్బుతంగా రాణించి 76 పరుగులు సాధించాడు. మ్యాన్ అప్ ది మ్యాచ్ గా బూమ్రా నిలిచాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more