వచ్చే నెలలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న టీమిండియా ఏ జట్టును బిసిసిఐ ఇవాళ ప్రకటించింది. సఫారీలపై స్వారీ చేసిన విజయంతో తిరిగిరావాలని అకాంక్షిస్తూ టీమిండియా ఏ జట్టులో సీనియర్ అటగాళ్లకు కెప్టెన్సీ పగ్గాలను అప్పగించింది. దీంతో పాటు ముక్కోణపు వన్డే సిరీస్ కూడా వుండటంతో జట్టును పటిష్టంగా వుండేలా బిసిసిఐ చర్యలు తీసుకుంది. ఇందుకోసం కరుణ్ నాయర్, మనీష్ పాండేలను కెప్టెన్లుగా ఎంపిక చేసింది. ఈ సిరీస్ ల కోసం భారత-ఎ జట్టు జులై, ఆగస్టులో దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది.
ఆస్ట్రేలియా, భారత్, దక్షిణాఫ్రికా మధ్య ముక్కోణపు వన్డే సిరీస్ జులై 26న ప్రారంభంకానుంది. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్‌లో ఇండియా-ఎ... ఆస్ట్రేలియా-ఎతో తలపడనుంది. ఫైనల్ ఆగస్టు 8న జరగనుంది. దీంతో వన్డే జట్టుకు కెప్టెన్ గా మనీష్ పాండేకు బిసిసిఐ పగ్గాలను అందించింది. కాగా ఆ తర్వాత దక్షిణాఫ్రికా-ఎతో భారత్-ఎ రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఒక్కో టెస్టు నాలుగు రోజుల పాటు జరగనుంది. ఈ మ్యాచులకు కెప్టెన్సీ పగ్గాలను కరుణ్ నాయర్ కు అప్పగించింది. కాగా జట్టు సభ్యుల వివరాలు ఇలా వున్నాయి.
వన్డే జట్టు: మన్దీప్ సింగ్, శ్రేయాస్ అయ్యర్, సంజు సామ్సన్, మనీశ్ పాండే(కెప్టెన్), దీపక్ హుడా, కరుణ్ నాయర్, కృనాల్ పాండ్య, రిషబ్‌పంత్(వికెట్‌కీపర్), విజయ్ శంకర్, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, జయంత్ యాదవ్, బసిల్ ధంపి, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, సిద్ధార్ద్ కౌల్
టెస్టు జట్టు: ప్రియాంక్ పంచల్, అభినవ్ ముకుంద్, శ్రేయస్ అయ్యర్, అంకిత్ బ్వానే, కరుణ్ నయర్(కెప్టెన్), సుదీప్ ఛటర్జీ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హనుమ విహారి, జయంత్ యాదవ్, షబాజ్ నదీమ్, నవదీప్ సైని, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, అంకిత్ చైదరి, అంకిత్ రాజ్‌పుత్.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more