సొంతగడ్డపై గత టెస్టు సీజన్లో అద్భుత విజయాలు సాధించిన టీమిండియా బుధవారం శ్రీలంక గడ్డపై గాలే టెస్టుతో కొత్త సీజన్‌ను ప్రారంభించనుంది. ఈ సందర్భంగా కెప్టెన్ విరాట్ కోహ్లి.. పరిమిత ఓవర్లలో ప్రతిభ కనబర్చిన టీమిండియా యువ క్రికెటర్లకు మరో శుభవార్తనందించే సంకేతాలు వెలువరించాడు. మరీ ముఖ్యంగా జట్టుకు అన్ని విధాల సేవలను అందించే అల్ రౌండర్లకు మందుగా ఈ సంకేతం అందుకోనున్నారని అన్నాడు.
టెస్టు మ్యాచ్ కు ముందు మీడియాతో మాట్లాడుతూ. 'ఆల్ రౌండర్లకు జట్టులో ఎప్పుడూ చోటుంటుంది. అదనపు ఆల్ రౌండర్ బ్యాట్స్ మెన్ ఉంటే జట్టుపై ఒత్తిడి తగ్గుతుంది. హార్దిక్ పాండ్యా లాంటి ఆటగాడు జట్టుకు నిజంగానే ఓ వరం. పరుగులు చేయడంతో పాటు కీలక సమయాల్లో వికెట్లు తీస్తాడు. దీంతో ప్రత్యర్ధి జట్టుపై సులువుగా ఒత్తిడి పెంచవచ్చు. ప్రతి కెప్టెన్ హార్దిక్ లాంటి ఆటగాళ్లు జట్టులో ఉండాలని కోరుకుంటాడు.
చివరగా 2015లో గాలేలో జరిగిన తొలి టెస్టులో అనూహ్యంగా ఓడినా ఆ వెంటనే పుంజుకుని 2-1తో సిరీస్ చేజిక్కుంచుకున్నాం. ప్రస్తుతం జట్టులో సమతూకం ఏర్పడింది. టాపార్డర్ తో పాటు మిడిలార్డర్ ఆటగాళ్లు కూడా రాణిస్తుండటం కలిసొచ్చే అంశం. ప్రత్యర్థి లంకపైనే ఒత్తిడి ఉందని భావిస్తున్నాను. ఓపెనర్ల విషయంపై కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. నూతనోత్సాహంతో లంక పర్యటనకు వచ్చాం. విజయాలతో తిరిగివెళ్తామన్న నమ్మకం ఉందని' కోహ్లి ధీమా వ్యక్తం చేశాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more