రాత్రి నిద్రలేదో.. లేక అలసిపోయాడో తెలియదు.. లేక వార్ వన్ సైడ్ అయినట్లుగా.. మ్యాచ్ కూడా వన్ సైడ్ అయ్యిందని భావించాడో ఏమో తెలియదు కానీ మొత్తానికి మ్యాచ్ లో ఏర్పడిన అంతరాయంలో ఈ క్రికెటర్ మంచి కునుకు తీసి.. అసలెందుకు ఆయనను కెప్టెన్ కల్ అని పిలిచారో అర్ధమయ్యేలా చేశారు. ఈ సన్నివేశం ఇండియా – శ్రీలంక క్రికెట్ మ్యాచ్ లో పల్లెకలె వేదికగా జరిగిన మూడో వన్డేలో చోటుచేసుకుంది.
సిరీస్ డిసైడ్ గేమ్ నడుస్తుంది. టీమిండియా విజయం ముంగిట్లోకి చేరుకుంది. ఈ సమయం లో శ్రీలంక అభిమానులు రెచ్చిపోయారు. సొంత జట్టు చిత్తుగా ఓడిపోవటాన్ని జీర్ణించుకోలేకపోయారు. గ్రౌండ్ లోకి వాటర్ బాటిల్స్, ప్లే కార్డ్స్, బ్యానర్స్ విసిరారు. మరో ఎనిమిది పరుగులు చేస్తే భారత్ విజయాన్ని అందుకోవడంతో పాటు సిరీస్ ను కూడా కైవసం చేసుకుంటుంది. దీంతో అగ్రహించిన అభిమానులు లంకజట్టు సభ్యులపై అవేశాన్ని వెళ్లగక్కారు. అభిమానుల ఆగడాలతో మ్యాచ్ కు బ్రేక్ వచ్చింది. క్రీజ్ లో ధోనీ, రోహిత్ ఉన్నారు.
మ్యాచ్ చాలా సేపటికి తిరిగి ప్రారంభం కాలేదు. దీంతో కొద్దిసేపు రోహిత్ తో మాట్లాడాడు. మరికొంత సమయం పిచ్ పై కూర్చుకున్నాడు ధోనీ. అయినా గేమ్ స్టార్ట్ కాలేదు. దీంతో చక్కగా గ్రౌండ్ పడుకున్నాడు. ఓ కునుకు కూడా తీశాడు. ఓ ఐదు నిమిషాలు ధోనీ అలాగే పడుకుని ఉండిపోయాడు. కాగా భద్రతా సిబ్బంది అల్లరి చేస్తున్న వారిని బయటకు పంపించడంతో మ్యాచ్ మళ్లీ కొనసాగింది. 45.1 ఓవర్లలో భారత్ లక్ష్యాన్ని ఛేదించడంతో మ్యాచ్‌తో పాటు సిరీస్‌నూ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ధోని 67 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
సిరీస్‌లో భాగంగా నాలుగో వన్డే ఈ నెల 31న కొలంబోలో జరగనుంది. ఇదిలావుండగా, అప్పటి వరకు సీరియస్ గా ఉన్న క్రికెట్ అభిమానులు కూడా ధోనీ కునుకుతో స్టేడియంలో నవ్వులు విరిశాయి. కామెంటేటరీలు కూడా జోకులు పేల్చారు. క్రికెట్ చరిత్రలో ఫస్ట్ టైం కావొచ్చు.. ఓ ఆటగాడులో గ్రౌండ్ లో కునుకు తీయటం. ధోనీ క్లోజప్ చూస్తే కూడా స్పష్టంగా అర్ధం అవుతుంది.. కళ్లు మూసి ప్రశాంతంగా నిద్రపోతున్నట్లు. దీనిపై నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో విధంగా సెటైర్లు పేల్చుతున్నారు.
#MSDhoni sleeping on a ground... He is so cool , nt bother abt surrounding environment.... @msdhoni #INDvSL #SLvIND #Dhoni pic.twitter.com/Q3ZXC9cG2E
— Rohan Zemse (@rohanzemse) August 27, 2017
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more