ఈ మధ్యకాలంలో తన అటతీరుతో తరచుగా వార్తల్లో నిలుస్తున్న క్రికెటర్ ఎవరైనా వున్నారా.. అదీనూ పసికూన లాంటి జట్టుతో అంటే.. నేనున్నాను అని వినిపించే పేరు.. రషీద్ ఖాన్. ఈ ఏడాది ఐపీఎల్ లో అరంగేట్రం చేయడంతోనే హల్ చల్ చేసిన రషీద్ ను.. రూ.4 కోట్లకు సైన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తీసుకోవడంతో హాట్ టాపిక్ గా మారాడు. ఇక ఇటీవల వెస్టిండీస్ లో కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో అమెజాన్ వారియర్స్ తరపున ఆడుతున్న ఆయనను ఓ యువతి పెళ్లి ప్రపోజల్ తీసుకురావడంతో.. ఇటీవల వార్తల్లో నిలిచాడు.
ఇక తాజాగా మరోమారు కూడా సీపీఎల్ లీగ్ లో భాగంగా వార్తల్లో నిలిచాడు రషీద్. తన స్పిన్ మాయాజలంతో చెలరేగిపోతున్న రషీద్ ఇవాళ ఏకంగా తన సత్తాను చాటి హ్యాట్రిక్ వికెట్లను సాధించి మెరిసాడు. డిఫెండింగ్ చాంపియన్ జమైకా తల్హాస్ తో జరిగిన మ్యాచ్ లో రషీద్ ఈ అరుదైన ఘనతను సాధించాడు. తొలుత జమైకా జట్టు బ్యాటింగ్ కు దిగిన క్రమంలో ఇన్నింగ్స్ 15వ ఓవర్ లో రషీద్ విజృంభించాడు. హ్యాట్రిక్ ను సాధించి మళ్లీ క్రికెట్ అభిమానులకు చర్చించుకునే అంశంగా మారిపోయాడు.
15వ ఓవర్ లో హ్యాట్రిక్ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఓవర్ మొదటి బంతికి మెక్ కార్తీ అవుట్ చేసిన రషీద్.. ఆ వెంటనే జా ఫూ ను కూడా అవుట్ చేసి వెనక్కు పంపాడు. రెండు వరుస బంతులకు రెండు వికెట్లను తీసని రషీద్.. ఇక కీలకమైన మూడో బంతికి కూడా రోవ్ మాన్ పావెల్ ను పెవిలియన్ కు పంపి హ్యాట్రిక్ ను నమోదు చేశాడు. ఈ మూడు వికెట్లను బౌల్డ్ రూపంలో రషీద్ ఖాతాలో చేరడం ఇక్కడ విశేషం. ఫలితంగా జమైకా జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి.. 168 పరుగులు సాధించగా, ఆ తరువాత బ్యాటింగ్ కు దిగిన అమెజాన్ వారియర్స్ సునాయాసంగా టార్గెట్ ను చేధించింది
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more