Six year old kid Letter to Sachin on His Biopic.

Sachin reavtion to fan special letter

Sachin: A Billion Dreams, Sachin Tendulkar, six-year-old kid, Sachin Letter, Sachin Thanks Kid fan, Sachin Special Kid Fan

Sachin: A Billion Dreams was such a hit that the cricketer Sachin Tendulkar is still receiving praise for the biopic. Recently, he received a beautiful hand-written note from a six-year-old kid and he shared the same on social media.

ఆరేళ్ల చిన్నారి లెటర్ కు సచిన్ రియాక్షన్

Posted: 09/08/2017 06:57 PM IST
Sachin reavtion to fan special letter

సచిన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ‘సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్’. ఈ ఏడాది మేలో విడుదలైన ఈ సినిమా సచిన్ అభిమానులనే కాకుండా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా సచిన్ రీల్ లైఫ్ ను ప్రతిబించించిన ఈ డాక్యుమెంటరీ తరహా చిత్రంకు సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియాలో సచిన్ కు కంగ్రాట్స్ తెలిపారు.

 

అయితే ఆ అభినందనల పరంపరను ఇంకా కొనసాగిస్తూ ఓ ఆరేళ్ల చిన్నారి రాసిన లేఖ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ‘డియర్ సచిన్ అంకుల్, మై నేమ్ ఈజ్ తార ('సార' దీదీలా). కానీ, నాకు ఆరేళ్ల వయసు. ఈ మధ్యనే మీ సినిమా చూశా.. నాకు చాలా బాగా నచ్చింది. ఈ సినిమా చూసి నేను నవ్వుకున్నా. ఎందుకంటే, చిన్నప్పుడు మీరు ఎంత అల్లరి పిల్లవాడోనని! నేను ఏడ్చాను..ఎప్పుడంటే.. మీ చివరి మ్యాచ్ చూసి. సచిన్ అంకుల్.. మిమ్మల్ని, సారా దీదీని, అర్జున్ భాయ్ ని, అంజలి ఆంటీని కలవాలని కోరుకుంటున్నాను. దయచేసి నేను కలవొచ్చా’ అని ఆ లేఖలో చిన్నారి తార కోరింది.

అంతే దానికి సచిన్ వెంటనే స్పందించాడు. ‘హాయ్, తార! నాకు ఈ లేఖ రాసినందుకు చాలా కృతఙ్ఞతలు.. ఈ సినిమా చూసి నువ్వు సంతోషపడినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కీప్ స్మైలింగ్ :)’ అని సంతోషం వ్యక్తం చేశారు. మరి ఆ చిన్నారి కోరికను సచిన్ తీరుస్తాడో లేదో చూడాలి మరి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles