పాకిస్తాన్ బౌలర్ ను ఆ దేశానికి చెందిన క్రికెట్ అభిమానులే అడిపోసుకున్నారు. వాళ్లే కాదు ఆ జట్టు ప్రధాన కోచ్ కూడా బౌలర్ నిర్వాకాన్ని జీర్ణించుకోలేక తిట్టిపోస్తూ.. ఏకంగా డ్రెసింగ్ రూమ్ లోకి వెళ్లిపోయాడు. అక్కడితో అగని అభిమానులు బౌలర్ ను.. నెట్టింట్లో సంచలనంగా మార్చుతూ.. అయనను విపరీతంగా విమర్శించారు. అసలేం జరిగిందంటే.. పాకిస్థాన్-శ్రీలంక మధ్య జరుగుతోన్న రెండో టెస్టులో పాక్ బౌలర్ ఒక బంతిని వేసేందుకు ఐదుసార్లు ప్రయత్నించడమే ఇందుకు కారణమైంది.
పాకిస్థాన్-శ్రీలంక మధ్య చివరిదైన రెండో టెస్టులో భాగంగా ఆదివారం మూడో రోజు ఆట జరిగింది. లంక తొలి ఇన్నింగ్స్ లో కరుణరత్నే-డిక్వెల్లా బ్యాటింగ్ చేస్తుండగా పాక్ బౌలర్ వాహబ్ రియాజ్ ఒక బంతిని వేసేందుకు ఐదు సార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. 111వ ఓవర్లో ఐదో బంతిని వేసేందుకు వచ్చిన రియాజ్ ఐదుసార్లు ప్రయత్నించాడు. బౌలర్ పేలవ ఫామ్ ను ప్రత్యక్షంగా వీక్షించిన ఆ జట్టు కోచ్ మిక్కి ఆర్థర్ అసహనం వ్యక్తం చేస్తూ మ్యాచ్ చూడకుండా గ్యాలరీ నుంచి డ్రస్సింగ్ రూమ్ లోపలికి వెళ్లిపోయాడు.
మైదానంలో ఉన్న పాక్ జట్టు సారథి సర్ఫరాజ్ అహ్మద్ పాటు బ్యాట్స్ మెన్లు, అంపైర్లు రియాజ్ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆ తర్వాత విజృంభించిన రియాజ్ 3 కీలక వికెట్లు పడగొట్టాడు. రియాజ్ బౌలింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో సంచలనంగా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. క్రికెట్ చరిత్రలో ఒక బంతి వేసేందుకు ఇలా ఐదుసార్లు ప్రయత్నించి విఫలమవడం ఇదే తొలిసారి అని విశ్లేషకులు బావిస్తున్నారు. దీంతో రియాజ్ బౌలింగ్ వేయడం ఎలాగో మరిచిపోయాడేమో అంటూ అభిమానులు చురకలంటించారు.
Wahab Riaz misses his run-up " FIVE TIMES " in a row
Mickey Arthur's Reaction
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more