ఫలితం తేలడానికి దాదాపుగా నాలుగు నుంచి ఐదు రోజుల సమయం పడుతుండంతో అభిమానుల్లో ఆసక్తి తగ్గిపోయి.. అదరణకు కొంత దూరంగా వెళ్తున్న టెస్టు క్రికెట్ ను మళ్లీ అభిమానుల చెరువ చేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంది అంతర్జాతీయ క్రికెట్ మండలి. ఇందుకోసం దాదాపు ఏడాది కాలంగా టెస్టు ఫార్మాట్ కు కొత్త రూపు తేవాలకుంటున్న ఐసీసీ ఎట్టకేలకు సరికొత్త కార్యాచరణ రూపొందించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
అభిమానులకు టెస్టు క్రికెట్ ను చేరువ చేసేందుకు ప్రణాళిక రచించిన ఐసీసీ.. అభిమానులు తప్పకుండా ఫాలో అయ్యేందుకు టెస్టు లో కూడా వినూత్న తరహా కాంపిటీషన్ తీసుకురావాలని వ్యూహం రచించింది. దీంతో పరిమితి ఓవర్ల సిరీస్ తరహాలోనే ఇకపై టెస్టు సిరీస్ లలో కూడా చాంపియన్ షిప్ టోర్నీలు, ప్రపంచ కప్ ఇక నుంచి టెస్టుల్లో కూడా కనువిందు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే టెస్టు చాంపియన్ షిప్ నిర్వహించేందుకు ICC గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ఏడాది కాలంగా ఐదు రోజుల పాటు జరిగే టెస్టు మ్యాచ్ లకు ప్రోత్సహించాలని స్పోర్ట్స్ గవర్నింగ్ బాడీ ఆలోచన. అయితే దానికి ఎట్టకేలకు ముగింపు పడినట్లు తెలుస్తోంది. అందుకు సుముఖత వ్యక్తం చేసిన ICC..టెస్టు చాంపియన్ టోర్నీకి ముందుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో టెస్టు హోదా కల్గిన 9దేశాలు పాల్గొననున్నాయి. ఆక్లాండ్ లో శుక్రవారం (అక్టోబర్-6) జరిగిన మీటింగ్ లోనే టెస్టుల్లో కొత్త విధానానికి ICC శ్రీకారం చుట్టినట్లు తెలిసింది. టెస్టు చాంపియన్ షిప్ నిర్వహణకు మరో రెండేళ్లు సమయం పట్టే అవకాశం ఉంది. 2019 లో మొదటి ఎడిషన్ రూపొందించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. లాడ్స్ లో ఫైనల్ మ్యాచ్ నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more