న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డు శతకం బాదడాన్ని ఎద్దేవా చేసిన ఆసీస్ మాజీ క్రికెటర్ డీన్ జోన్స్‌పై భారత క్రికెట్ అభిమానులు విరుచుకుపడుతున్నారు. కివీస్‌ను చూసి ఆసీస్ నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఎద్దేవా చేస్తున్నారు. కివీస్‌తో జరిగిన వన్డేలో కోహ్లీ 31వ సెంచరీ సాధించడం ద్వారా వన్డేల్లో సచిన్ తర్వాత అత్యధిక సెంచరీలు నమోదు చేసిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. డీన్ జోన్స్ దీనిని ప్రస్తావిస్తూ ‘‘కోహ్లీ.. నువ్వు చాలా బాగా ఆడావు. కాకపోతే అది మళ్లీ న్యూజిలాండ్ అన్నది గుర్తుపెట్టుకో’ అని ఎగతాళి చేశాడు.
డీన్ జోన్స్ ట్వీట్‌తో ఒళ్లుమండిన భారత్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతడిలాగే ఎగతాళి ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు. ఆస్ట్రేలియా కంటే న్యూజిలాండే ఉత్తమ జట్టని ఒకరంటే, ఆ జట్టును చూసి ఆస్ట్రేలియా నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఇంకొకరు ట్వీటారు. వారు గెలిచారని, ఆసీస్ మాత్రం 4-1తో ఓడిందని గత సిరీస్‌ను గుర్తు చేశారు. సాక్ష్యం కావాలంటే మరోసారి ఇండియా రావాలంటూ గట్టిగా బదులిచ్చారు. ఇవాన్నీ చూసిన తరువాత గిల్లి మరీ కోట్టించుకునేవాళ్లు ఎవరైనా వుంటారా..? అంటే అది డీన్ జోన్స్ తరువాతే ఎవరైనా అన్న కామెంట్లు కూడా నెట్ లో దర్శనమిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more