భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన ఘనతను అందుకున్నాడు. నిత్యం వికెట్ల వెనకవుండి బౌలర్ల చేత తనకు కావాల్సిన విధంగా బౌలింగ్ చేయించుకుని ప్రత్యర్థుల వెన్ను విరచడంలో కీలకపాత్రం పోషించే ఈ మాజీ సారధి తాజాగా వికెట్ల వెనుక రెండు వందలు పూర్తి చేశాడు. అదేంటి వికెట్ల వెనుక రెండు వందలు అంటారా..? వికెట్ల వెనుక రెండు వందల క్యాచులను పూర్తి చేసి.. తోలి భారత కీపర్ గా రికార్డును సృష్టించాడు.
స్వదేశంలో మాత్రమే రెండు వందల క్యాచులను పట్టిన ఏకైక కీపర్ గా ధోని ఈ రికార్డును అందుకున్నాడు. భారత్-న్యూజిలాండ్ మధ్య పుణెలో బుధవారం రెండో వన్డే జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో మూడో ఓవర్లో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో కివీస్ ఓపెనర్ గప్తిల్ వికెట్ కీపర్ ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ క్యాచ్‌తో సొంతగడ్డపై 200 క్యాచ్‌లను పట్టిన తొలి భారత వికెట్ కీపర్‌గా ధోనీ రికార్డు సృష్టించాడు.
ఇప్పటి వరకు కుమార సంగక్కర(శ్రీలంక), స్టీవార్ట్(ఇంగ్లాండ్) మాత్రమే తమ తమ దేశాల్లో 200పైగా క్యాచులను అందుకున్నారు. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ధోనీ ఇప్పటి వరకు 288 క్యాచులు పట్టాడు. అడమ్ గిల్‌క్రిస్ట్(417), మార్క్ బౌచర్(402), సంగక్కర(383) మాత్రమే వన్డే క్రికెట్లో ధోనీ కంటే ముందు ఉన్నారు. న్యూజిలాండ్ తో నిన్న జరిగిన మ్యాచులో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. సిరీస్‌లో నిర్ణయాత్మక మూడో వన్డే ఈ నెల 29న కాన్పూర్‌లో జరగనుంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more