BCCI commentators may have to give up writing columns గవాస్కర్ కు షాక్.. అకాడమి తరువాత కాలమ్స్ పై..

Bcci commentators may have to give up writing columns

Sunil Gavaskar, bcci coa, VVS Laxman, Virender Sehwag, Virat Kohli, Sanjay Manjrekar, National Cricket Academy, Murali Kartik, Lodha Committee, Harsha Bhogle, conflict of interest, cricket news, sports news, latest sports news, cricket

Batting legend Sunil Gavaskar could be in for a bigger blow as he may be asked to choose between commentating for the BCCI, or writing sponsored columns and participate in sponsored awards/rating programs.

గవాస్కర్ కు షాక్.. అకాడమి తరువాత కాలమ్స్ పై..

Posted: 11/13/2017 04:05 PM IST
Bcci commentators may have to give up writing columns

కాన్ప్లిక్ట్ అఫ్ ఇంట్రెస్ట్ (పరస్పర విరుద్ధ ప్రయోజనాల) నిబంధనల నేపథ్యంలో అటు బీసీసీఐ పెద్దలతో పాటు ఇటు మాజీ క్రికెటర్లకు షాకుల మీద షాకులిస్తోంది. లోధా కమిటీ సిఫార్పులు అమల్లోకి వచ్చిన తరవాత ఆ కమిటీ ప్రతిపాదించిన విధానాలను, నిబంధలను పాటించక తప్పని సంకట పరిస్థితుల్లోకి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు చేరుకుంది. ఇప్పటికే దీని వల్ల టీమిండియా మాజీ క్రికెటర్, ది వాల్ రాహుల్ ద్రావిడ్ ఐపీఎల్ అవకాశాలను కోల్పోగా, టీమిండియ మాజీ కెప్టెన్ సునీల్‌ గావస్కర్‌ తన ఆటగాళ్ల నిర్వహణ సంస్థను కూడా మూసివేశారు.

అయితే ఇప్పుడీ నిబంధన మేరకు ఆయన మరో సంకట పరిస్థితుల్లో చిక్కుకున్నాడు. బీసీసీఐ అధికారిక వ్యాఖ్యాతగా వున్న ఆయన దాంతో పాటు పలు జాతీయ దినపత్రికలకు వ్యాసాలు రాస్తారు. అయితే ఈ రెండింటిలో ఏదో ఒకటి వదులుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు గవాస్కర్ ముందుంది. బిసిసిఐ తో ఒప్పందం చేసుకన్న నేపథ్యంలో.. అటు వ్యాఖ్యతగా కొనసాగుతూ.. ఇటు వ్యాసాలు రాస్తూ మరో కోణంలో అదాయాన్ని సమకూర్చుకోరాదన్నది సారంశం. అయితే బిసిసిఐ అవకాశాన్ని వదులుకోవడం ఇష్టం లేని సన్నీ ఇకపై వార్తా పత్రికలకు వ్యాసాలు రాయరని సమాచారం.

అక్టోబర్‌ 24న బీసీసీఐ క్రికెట్ పాలకుల కమిటీ (సీఓఏ) సమావేశం జరిగింది. అప్పుడు బీసీసీఐ వ్యాఖ్యాతలు పత్రికలకు డబ్బులకు వ్యాసాలు రాస్తున్న విషయమై చర్చించినట్టు తెలిసింది. ఇది కాన్ప్లిక్ట్ అఫ్ ఇంట్రెస్ట్ (పరస్పర విరుద్ధ ప్రయోజనాల) కిందకు వస్తుందని తేల్చినట్టు సమాచారం. మాజీ క్రికెటర్లు సునీల్‌ గావస్కర్‌, సంజయ్‌ మంజ్రేకర్‌, మురళీ కార్తీక్‌, క్రికెట్‌ విశ్లేషకుడు హర్ష భోగ్లేకు బీసీసీఐతో ఒప్పందం ఉంది. అంటే వీరు ఇకపై వార్తా పత్రికలకు వ్యాసాలు రాయడానికి, ఛానెళ్లలో విశ్లేషణలు చేయడానికి వీల్లేదు. అయితే వీరేంద్రసెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్ లకు మాత్రం ఈ నిబంధన వర్తించదు. ఎందుకంటే వీరు స్టార్ స్పోర్ట్స్ తో ఒప్పందం చేసుకున్నారు కానీ బిసిసిఐతో కాకపోవడమే కారణం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunil Gavaskar  bcci coa  VVS Laxman  Virender Sehwag  Lodha Committee  cricket  

Other Articles