టీమిండియా క్రికెటర్ల మొరను ఎట్టకేలకు బిసిసిఐ అలకించింది. వారికి ఇవాళ తీయటి కబురును అందించింది. జస్టిస్ లోథా కమిటీ సిఫార్పులు అమల్లోకి వచ్చిన తరువాత నుంచి దేశీయంగా .జరిగే సిరీస్ లలో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణించాల్సిన సమయాల్లో క్రికెటర్లు ఎకానమీ క్లాస్ ద్వారానే ప్రయాణించాల్సి వచ్చేది. అయితే ఎకానమీ క్లాస్ ప్రయాణాలతో తాము అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని క్రికెటర్లు గత కొన్నేళ్లుగా బిసిసిఐ దృష్టికి తీసుకెళ్తునే వున్నారు.
ఎకానమీ క్లాస్ ప్రయాణాల్లో తాము తీవ్ర అసౌకర్యానికి గురువుతున్నామని, తోటి ప్రయాణికుల్లో చాలా మంది తమను సెల్పీల పేరుతో తమ స్థానాల వద్దకు రావడం.. దీనికి తోడు కుదరని చెప్పిన పక్షంలో అక్కడే నిల్చుని వారికి వారే సెల్పీలు తీసుకోవడం.. చేశారని ఇప్పటికే పలువురు క్రికెటర్లు బిసిసిఐకి ఫిర్యాదు చేశారు. దీినిక తోడు ఈ క్లాస్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు తమ కాళ్లు పెట్టుకోవడానికి కూడా అనువుగా స్థలం లేదని కూడా తెలిపారట. దీంతో విదేశాల్లో పర్యటనలకు సమకూర్చే విధంగా తమకు దేశీయంగా కూడా బిజినెస్ క్లాస్ టిక్కెట్లు కల్పించాలని కోరారు.
టీమిండియా క్రికెటర్లు ఎదుర్కోంటున్న సమస్యలను పరిశీలించిన బిసిసిఐ ఎట్టకేలకు వారి మొరను అలకించింది. ఇక నుంచి దేశీయ ప్రయాణాలకు కూడా బిజినెస్ క్లాస్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఆమోద ముద్ర వేసినట్లు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షడు సీకే నేతృత్వంలోని సీఓఏ కమిటీ స్పష్టం చేసింది. స్వదేశంలో మ్యాచ్ లు జరిగే సమయంలో ఇక అటగాళ్లు బిజినెస్ క్లాస్ లోనే పర్యటించేందుకు ఇటీవల జరిగిన సీఓఏ సమావేశంలో ఆమోదం తెలిపినట్లు సీకే ఖన్నా తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more