Bumrah, parthiv gets call-up for SA Tests దక్షిణాఫ్రికాతో టెస్టు షెడ్యూలు, జట్టు ఇదే..

Jasprit bumrah gets maiden call up for south africa tests

India tour of south africa, Jasprit Bumrah, India v South Africa, Virat Kohli, Parthiv Patel, Deepak Hooda, sports news,sports, latest sports news, cricket news, cricket

Gujarat speedster Jasprit Bumrah predictably got his maiden call-up in the 17-member Indian Test squad for the South Africa tour

దక్షిణాఫ్రికాతో టెస్టు షెడ్యూలు, జట్టు ఇదే..

Posted: 12/05/2017 06:07 PM IST
Jasprit bumrah gets maiden call up for south africa tests

శ్రీలంకతో వన్డే, టీ 20 సిరీస్ ముగిసిన తరువాత టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాతో మూడు టెస్టు మ్యాచులను టీమిండియా అడనుంది. డిసెంబర్ మాసం ముగిసీ ముగియకముందే సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న టీమిండియా.. ఈ నెల 30 అక్కడి జట్టుతో రెండు రోజల పాటు వార్మప్ మ్యాచ్ లో తలపడనుంది. ఇందుకు పార్ల లోని బోలాండ్ పార్క్ స్టేడియం వేదికకానుంది.

ఇక టీమిండియా అతిథ్య జట్టుతో జనవరి ఐదవ తేదీన కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ స్టేడియం వేదికగా తొలి టెస్టులో పాల్గొననుంది. ఆ తరువాత జనవరి 13న సెంచూరియన్ లోని సుపర్ ప్పోర్ట్ పార్క్ వేదికగా రెండో టెస్టు, జోహన్నస్ బర్గ్ వేదికగగా న్యూ వాండరర్స్ స్టేడియంలో జనవరి 24న మూడవ టెస్టులో విరాట్ సేన దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఇక ఈ టెస్టులకు ఇప్పటికే బిసిసిఐ జట్టు సభ్యులను కూడా ఎంపిక చేసింది. ఈ జాబితాలో రమారమి పాతవారికే స్థానం దక్కగా కొత్తగా పార్థివ్ పటేల్ కూడా పిలుపు అందింది.
 
పర్యటనకు వెళ్లనున్న టీమిండియా జట్టు ఇదే:

విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), లోకేష్‌ రాహుల్‌, శిఖర్‌ ధవన్‌, మురళీ విజయ్‌, చటేశ్వర్‌ పుజారా, అజింక్యా రహానె, రోహిత్‌ శర్మ, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, ఉమేష్‌ యాదవ్‌, మహమ్మద్‌ షమి, ఇషాంత్‌ శర్మ, వృద్ధిమాన్‌ సాహా, పార్థివ్‌ పటేల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, జస్ర్పీత్‌ బుమ్రా, హార్దిక్‌ పాండ్యా

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jasprit Bumrah  India v South Africa  Virat Kohli  Parthiv Patel  Deepak Hooda  cricket  

Other Articles