India scent Test victory as pollution makes bowlers vomit ఢిల్లీలో అడాలంటే వాంతులు కావాల్సిందే..!

Pacers shami lakmal vomits on forth day of smog choked delhi stadium

Suranga Lakmal, mohammad shami, Team India, Sri Lanka, India, New Delhi, Feroz Shah Kotla Ground, Delhi Pollution, Delhi Smog, TeamIndia, cricket, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Indian cricketer, Suresh Raina recently purchased a suave Mercedes SUV from the state of Uttarakhand, which made him to hit headlines again

ఢిల్లీలో అడాలంటే వాంతులు కావాల్సిందే..!

Posted: 12/05/2017 06:57 PM IST
Pacers shami lakmal vomits on forth day of smog choked delhi stadium

ఆటగాళ్ల ఆరోగ్యం గురించి శ్రీలంక జట్టు మేనేజ్‌మెంట్‌ తీవ్రంగా ఆలోచిస్తుందని కోచ్‌ నిక్‌ పోఠాస్‌ అన్నారు. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆక్సిజన్‌ సిలిండర్లు సైతం ఉన్నాయన్నారు. సురంగ లక్మల్‌, లాహిరు గమగె, ధనంజయ డిసిల్వా వాంతులు చేసుకున్నారని వెల్లడించారు.. ఇది క్రితం రోజు పరిస్థితి. మరీ ఇవాళ అదే పరిస్థితి ఎదుర్కొన్నారు క్రికెటర్లు. అయితే శ్రీలంక క్రికెటర్లకు జతకలిశాడు ఇండియన్ పేస్ బౌలర్ షమీ కూడా జతకలిశాడు. అంతకుముందే ఇవాళ శ్రీలంక పేస్‌ బౌలర్‌ సురంగ లక్మల్‌ మైదానంలో వాంతి చేసుకున్నాడు.

ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో భారత్‌-శ్రీలంక మధ్య మూడో టెస్టు నాలుగో రోజున కూడా అటగాళ్లు వాయుకాలుష్యం ధాటికి తట్టుకోలేక వాంతులు చేసుకున్నారు. ఇవాళ ఉదయం టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో లంక బౌలర్‌ సురంగ లక్మల్‌ మరోసారి వాంతులు చేసుకున్నాడు. రెండో రోజు ఆటలో లక్మల్‌ ఓవర్‌ పూర్తి చేయలేక ఐదో బంతి వేయగానే పెవిలియన్ కు వెళ్లిపోయాడు. డ్రస్సింగ్ రూమ్ లో వాంతి చేసుకున్నాడు. తాజాగా నాలుగో రోజు ఆటలో కూడా లక్మల్‌ మరోసారి మైదానంలోనే వాంతి చేసుకున్నాడు. దీంతో మైదానం వదిలి వెళ్లిన అతడు కొంత సేపటికి తిరిగి వచ్చాడు.

ఆ తరువాత కాలుష్య పొగ కారణంగా స్వల్ప అస్వస్థతకు గురైన టీమిండియా పేసర్ మహమ్మద్‌ షమి మైదానంలో వాంతి చేసుకున్నాడు. 246/5 వద్ద కోహ్లీ సేన రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంతో లంక బ్యాటింగ్ కు దిగింది. ఆరో ఓవర్‌ వేసేందుకు షమి బంతిని అందుకున్నాడు. 5.5 వద్ద షమి వేసిన బంతిని ఎదుర్కొన్న సమరవిక్రమ(5).. రహానెకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. ఆ తర్వాత షమి తన ఓవర్ లో చివరి బంతిని వేసేందుకు ఉపయుక్తుడు అవుతున్న క్రమంలో ఇబ్బంది పడ్డాడు. మైదానంలోనే వాంతి చేసుకున్నాడు. మిగిలి ఉన్న ఒక్క బంతిని వేసిన తరువాత 7వ ఓవర్‌ అనంతరం షమి.. అంపైర్‌కు చెప్పి మైదానాన్ని వీడాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles