ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా పర్యాటక జట్టు శ్రీలంకతో జరుగుతున్న చివరి టెస్టులో భారత్ విజయం శగా పయనిస్తోంది. నాల్గవ రోజున చివరి రోజు మరో 7 వికెట్లు పడగొడితే విరాట్ సేనను విజయం వరింస్తుంది. ఇవాళ ఆట అనేక మలుపులు తిరిగింది. మూడో రోజు లంక బ్యాటింగ్ కు అనుకూలించిన పిచ్ టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో పూర్తిగా మారిపోయింది. బౌలింగ్ కు సహకరించింది. అయినా పట్టు విడువని కోహ్లీసేన మరోసారి దుమ్మురేపి ఒక దశలో రెండో ఇన్నింగ్స్ ను కూడా డిక్లేర్ చేసింది. ఇక అట ముగిసే సమయానికి లంక మూడు వికెట్లను నష్టపోయింది.
ఓవర్‌నైట్ స్కోరు 356/9తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఆ జట్టు మరో 26 పరుగులకే ఆలౌటైంది. సారథి చండిమాల్ (164; 361 బంతుల్లో 21×4, 1×6) కెరీర్లో అత్యుత్తమ స్కోరు నమోదు చేశాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌ను భారత్ 246/5కు డిక్లేర్ చేసి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో లంకకు 410 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. బదులుగా బ్యాటింగ్‌కు దిగిన పర్యాటక జట్టు ఆట ముగిసే సరికి 31/3తో నిలిచింది. 379 పరుగుల దూరంలో నిలిచింది. ధనంజయ డిసిల్వా (13; 30 బంతుల్లో 1×6), ఏంజెలో మాథ్యూస్ (0) క్రీజులో ఉన్నారు.
బ్యాటింగ్ కు అనుకూలించని పిచ్ పై రెండో ఇన్నింగ్స్ లో కోహ్లీసేన తెలివిగా ఆడింది. 163 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో బరిలోకి దిగిన భారత్ లో శిఖర్ ధావన్ (67; 91 బంతుల్లో 5×4, 1×6), విరాట్ కోహ్లీ (50; 58 బంతుల్లో 3×4), రోహిత్ శర్మ (50 నాటౌట్; 49 బంతుల్లో 5×4) అర్ధశతకాలు సాధించారు. ఛెతేశ్వర్ పుజారా (49; 66 బంతుల్లో 5×4) త్రుటిలో అర్ధశతకం చేజార్చుకున్నాడు. పిచ్ లో మార్పుతో టీమిండియా 10 పరుగులకే ఓపెనర్ మురళీ విజయ్ (9) వికెట్ చేజార్చుకుంది. అతడు లక్మల్ బౌలింగ్ లో డిక్వెలాకు క్యాచ్ ఇచ్చాడు. మూడో స్థానంలో వచ్చిన అజింక్య రహానె (10) ఆకట్టుకోలేదు. పరుగులు చేసేందుకు ఇబ్బంది పడి జట్టు స్కోరు 29 వద్ద పెరీరా బౌలింగ్‌లో సండకన్కు క్యాచ్ ఇచ్చాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more