Steven Smith breaks Tendulkar's record క్రికెట్ లెజెండ్ స్కోరును బ్రేక్ చేసిన స్మీత్

Steven smith slams double century breaks sachin tendulkar s 18 year old record

Steven Smith, Ashes, Ashes 2017-18, Sachin Tendulkar, England Vs Australia, Australia vs England, Cricket, sports news, cricket news, latest cricket news, latest sports news, latest news

Australia captain scored his second double century on Saturday as he continued to crush the English bowling attack in the current Ashes series

క్రికెట్ లెజెండ్ స్కోరును బ్రేక్ చేసిన స్మీత్

Posted: 12/16/2017 06:23 PM IST
Steven smith slams double century breaks sachin tendulkar s 18 year old record

టీమిండియా లెజెండ్ క్రికెటర్ సచిన్‌ టెండుల్కర్‌ సాధించిన అరుదైన రికార్డును ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సారథి స్టీవ్ స్మిత్ బద్దలు కొట్టాడు. యాషెస్ మహా సమరంలో భాగంగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో మూడో రోజు స్మిత్‌ 138 బంతుల్లోనే అజేయ శతకం బాదేశాడు. దీంతో తన కెరీర్ లో 22వ సెంచరీని నమోదు చేసిన స్మిత్.. టెస్టు క్రికెట్‌ చరిత్రలో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన మూడో వ్యక్తిగా స్మిత్‌ అవతరించాడు. సచిన్‌ రికార్డును దాటేశాడు.

సచిన్ 22 శతకాలు సాధించేందుకు 114 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. స్టీవ్‌ స్మిత్ 108 ఇన్నింగ్స్ ల్లోనే సాధించాడు. అతని కన్నా ముందు డాన్ బ్రాడ్‌మన్ (58 ఇన్నింగ్స్‌), సునీల్‌ గావస్కర్ (101 ఇన్నింగ్స్) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. స్మిత్ 22వ శతకం సాధించే క్రమంలో ఈ ఏడాది 1000 పరుగుల మైలురాయిని దాటేశాడు. ఈ సందర్భంగా ట్విటర్లో అతనిపై ప్రశంసలు కురిశాయి. రోహిత్‌ శర్మ, పాల్ హేవర్డ్‌, ఆకాశ్‌ చోప్రా, టామ్ మోరిస్, టిమ్‌, మైకేల్ వాగన్ ప్రశంసించారు.

ఇక మూడో టెస్టు మూడో రోజు శతకంతో నిలిచిన స్టీవ్ స్మిత్  (229 బ్యాటింగ్‌; 390 బంతుల్లో 28×4, 1×6) నాలుగో రోజు, శనివారం ద్విశతకం పూర్తి చేసుకున్నాడు. 1971 తర్వాత యాషెస్‌ సిరీస్‌లో ద్విశతకం బాదిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అతనికి తోడుగా మిచెల్‌ మార్షల్‌ (181 బ్యాటింగ్‌; 234 బంతుల్లో 29×4) చెలరేగాడు. దీంతో ఆట ముగిసే సరికి ఆసీస్‌ 146 పరుగుల ఆధిక్యంతో ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles