టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజా అద్భుతం చేశాడు. టీమిండియా తరపున కేవలం రవిశాస్త్రీ, యువరాజ్ సింగ్ లు మాత్రమే చేసిన అరుదైన ఫీటును చేసి.. వారి సరసన స్థానాన్ని సంపాదించాడు. శ్రీలంకతో జరుగుతున్న వన్డే జట్టులో చోటు సంపాదించుకోలేకపోయిన జడేజా ప్రస్తుతం సౌరాష్ట్ర తరపున ఆడుతున్నాడు. సౌరాష్ట్ర క్రికెట్ సంఘం (ఎస్సీఏ) నిర్వహించిన అంతర్ జిల్లా టీ20 టోర్నీలో జడేజా చెలరేగిపోయాడు. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది రవిశాస్త్రి, యువరాజ్ సింగ్ ల పక్కన స్థానాన్ని సంపాదించాడు
జామ్ నగర్ జట్టు తరపున ఆడుతున్న రవీంద్ర జడేజా.. అమ్రేలీ జట్టుతో జరిగిన మ్యాచులో బ్యాటింగ్ కు దిగి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అల్ రౌండర్ గా పేరొందిన జడేజా గ కొన్నాళ్లుగా తన చేతి నుంచి జాలువారే బంతులకే పనిచెబుతున్నాడు.. తప్ప తన బ్యాటు నుంచి పరుగులను రాబట్టలేకపోతున్నాడు. ఈ విషయాన్ని గ్రహించాడో ఏమో కానీ.. ఇవాళ తన బ్యాటు నుంచి పరుగుల వరదను రాబట్టాడు. 69 బంతుల్లో 15 ఫోర్లు, 10 సిక్సర్లతో 154 పరుగులు చేశాడు.
15వ ఓవర్ లో ఆఫ్ స్పిన్నర్ నీలం వంజాకు పట్టపగలే చుక్కలు చూపించాడు. వేసిన ఆరు బంతులను సిక్సర్లు బాది అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. జడేజా దెబ్బకు అమ్రేలీ జట్టు పరాజయం పాలైంది. కాగా, గతంలో రవిశాస్త్రి, యువరాజ్ సింగ్‌లు ఈ ఘనత సాధించారు. 1985లో జరిగిన రంజీ ట్రోఫీలో ముంబై తరపున బరిలోకి దిగిన రవిశాస్త్రి బరోడా బౌలర్ తిలక్‌రాజ్ బౌలింగ్‌లో ఆరు సిక్సర్లు కొట్టాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు సిక్సర్లు కొట్టాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more