వివాహ బంధంతో ఒక్కటైన టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శర్మలు తన బంధుమిత్రుల కోసం ప్రత్యేకంగా ముంబైలో ఏర్పాటు చేసిన విందు కార్యాక్రమానికి అటు బాలీవుడ్ ప్రముఖులతో పాటు ఇటు క్రికెట్ దిగ్గజాలు కూడా హాజరుకాగా, అదే రోజున మరో క్రికెటర్ కూడా మెహెందీ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాడు. అది మరెవరో కాదు టీమిండియా యువ అల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్న హార్థిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యాదే. ఇవాళ వివాహకార్యక్రమాన్ని జరుగుతున్న క్రమంలో నిన్న మెహెందీ కార్యక్రమం ముగిసింది.
ఈ కార్యక్రమంలో పాండ్యా బ్రదర్స్ ఇరగదీశారు. ముంబై ఇండియన్స్ జట్టుకు కలిసి ఆడే కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా.. అదిరిపోయే స్టెప్పులేశారు. అన్న కృనాల్ పాండ్యా మెహెందీ ఫంక్షన్ సందర్భంగా హార్దిక్ రెచ్చిపోయి డ్యాన్స్ చేశాడు. గర్ల్‌ఫ్రెండ్ పంకురి శర్మను పెళ్లి చేసుకున్నాడు కృనాల్. మెహెందీ వేడుక సందర్భంగా ఈ అన్నదమ్ములు కలిసి వేసిన డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పంజాబీ మ్యూజిక్‌తోపాటు కొన్ని బాలీవుడ్ ట్యూన్స్‌కు కూడా వీళ్లు స్టెప్పులేశారు. టీమిండియా బ్యాట్స్‌మన్ మనీష్ పాండే కూడా వీళ్లతో కలిసి డ్యాన్స్ చేశాడు. ఈ పెళ్లికి సచిన్ తో పాటు పలువురు క్రికెట్ ప్లేయర్లు హాజరైనట్లు సమాచారం.
If you enjoyed this Post, Sign up for Newsletter
(And get your daily news straight to your inbox)
Other Articles
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: టాప్ ప్లేస్ లోనే కొనసాగుతున్న టీమిండియా
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
లండన్ హోటల్లో టీమిండియా మహిళా క్రికెటర్ బ్యాగ్ చోరీ
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
దీప్తీ శర్మ రనౌట్ వివాదంలో తెరదించిన క్రీడా విశ్లేషకుడు
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
మహిళల టీ20 ఆసియా కప్ బరిలో తెలుగమ్మాయి మేఘన
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్‌కు తప్పిన పెను ప్రమాదం
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more