Will Virat Kohli break 21 years old record in cape town.? 21 ఏళ్లనాటి రికార్డు బద్దలయ్యేనా..? పథిలంగానే వుండేనా.?

Will virat kohli break 21 years old record in cape town

India vs South Africa, sachin tendulkar, virat kohli, cape town, Rohit Sharma, Team India, Yearender 2017, Virat Kohli in 2017, Virat Kohli's records in 2017, Virat Kohli runs in 2017, India national cricket team, Indian cricket in 2017, sports, sports news, cricket, cricket news, latest sports news, latest cricket news

Having already established himself among the greats of the game - Virat 'Run Machine' Kohli once again finished the year topping the batting charts, but the questions araise on breaking sachin tendulkar's 21 year old record in cape town.

21 ఏళ్లనాటి రికార్డు బద్దలయ్యేనా..? పథిలంగానే వుండేనా.?

Posted: 12/27/2017 08:19 PM IST
Will virat kohli break 21 years old record in cape town

శ్రీలంక పర్యటన ముగియడంతో., భారత క్రికెట్ అభిమానులు సంతోషంగా వున్నారు. అయితే తాజాగా టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుండటంతో అక్కడ కూడా విజయాన్ని నమోదు చేసి విరాట్ సేన రికార్డులను సొంత చేసుకుంటుందా..? అన్న ప్రశ్నలు మదిలో మెదలుతున్నాయి. దక్షిణాఫ్రికాతో మూడు టెస్టులు ఆడేందుకు బయల్దేరనున్న టీమిండియా విదేశీ గడ్డపై కూడా విజయాన్ని నమోదు చేసుకుంటుందా.? అన్న ప్రశ్నతో పాటు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండుల్కర్‌ నెలకొల్పిన రికార్డును కోహ్లీ బద్దలు కొడతాడా లేదా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

జనవరి 5న కేప్ టౌన్ వేదికగా భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య మొదటి టెస్టు ప్రారంభంకానుంది. ఈ తరుణంలో సచిన్ నెలకొల్పిన రికార్డును విరాట్ బద్దలు కోడతాడా అన్నది లేదా..? అన్న విషయమై అసక్తి నెలకొంది. 21 ఏళ్ల క్రితం కేప్ టౌన్ లో జరిగిన టెస్టులో సచిన్‌ 169 పరుగులు సాధించగా.. ఆ తర్వాత టీమిండియా ఎన్నిసార్లు సఫారీ పర్యటనకు వెళ్లినా కేప్ టౌన్ లో సచిన్ నెలకోల్పిన రికార్డును మాత్రం బ్రేక్ చేయలేదు. దీంతో 21 ఏళ్లుగా పథిలంగా వున్నసచిన్ రికార్డును ఈ సారైనా విరాట్ బ్రేక్ చేస్తాడా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ప్రస్తుతం కోహ్లీ అద్భుత ఫామ్ లో ఉన్నాడు. ఇదే ఫామ్ ను విదేశీ గడ్డపై కొనసాగిస్తే సచిన్‌ రికార్డు బద్దలవ్వడం తథ్యం. అయితే ఇక్కడ మరో ప్రత్యేకత కూడా వుంది. టెస్టు జట్టులో పూజారా, రహానే, మురళీ విజయ్, కెఎల్ రాహుల్, రహానే, రోహిత్ శర్మలు వున్నా.. విరాట్ కోహ్లీనే ఈ రికార్డును బద్దలు కొట్టాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే.. 1997లో టీమిండియా పర్యటించిన సమయంలో సచిన్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే ఇప్పుడు కూడా కెప్టెన్ గా విరాట్ ఈ రికార్డును బద్దలు కోడితే రికార్డును తిరగరాసినట్టే. మరి సచిన్‌ రికార్డును కోహ్లీ బద్దలు కొడతాడో లేదో వేచి చూద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs South Africa  sachin tendulkar  virat kohli  cape town  Rohit Sharma  cricket  

Other Articles