దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టు కేప్ టౌన్ వెళ్లిన సంగతి తెలిసిందే. వీరితో పాటు కొత్త పెళ్లి జంట అనుష్క-విరాట్లు కూడా తమ రెండో హనీమూన్ ను అక్కడ జరుపుకుంటున్నారు. అయితే కేప్ టౌన్ లో పరిస్థితులు వారికి ఇబ్బందులను కలిగిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ వేసవికాలం కావడంతో నీళ్లకరువు వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి నీళ్ల కోసం కేప్ టౌన్ జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారితో పాటు పర్యాటకులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.
ఈ నీళ్లకరువు తీవ్రతను తెలియజేయడానికి కేప్‌టౌన్ విమానాశ్రయంలోనే ప్రకటనలు ఇస్తున్నారు. పర్యాటకులు నీళ్లు తక్కువగా వాడాలని ఎక్కడికక్కడ సూచన బోర్డులను ఉంచారు. తాజ్, సదరన్ సన్ వాటర్‌ఫ్రంట్ వంటి ప్రముఖ హోటళ్లు కూడా వీలైనంత మేరకు తక్కువ నీళ్లు వాడాలని చెబుతున్నాయి. నీళ్ల వాడకం గురించి ఇప్పటికే కేప్‌టౌన్ పట్టణ యంత్రాంగం ఆరో స్థాయి హెచ్చరికలను కూడా జారీ చేసింది. దీంతో విరుష్క హనీమూన్ ఆనందాన్ని ఈ నీళ్ల కరువు కబళించినట్లైంది.
పర్యాటక రంగం మీదే ఆర్థికంగా ఆధారపడే కేప్‌టౌన్ జీడీపీకి ఈ నీళ్లకరువు కారణంగా తీవ్ర గండి పడే అవకాశం కన్పిస్తోంది. వీలైనంత మేరకు పర్యాటకులకు నీటి ఇబ్బంది కలగకుండా చేసేందుకు హోటళ్లు ప్రయత్నిస్తున్నాయి. అంతేకాకుండా... హాట్ టబ్ బాతింగ్, స్పా, రోస్ వాటర్ బాతింగ్ వంటి కేప్‌టౌన్ ప్రఖ్యాత మసాజ్ విధానాలను కూడా ఈ హోటళ్లు నిలిపివేయాల్సి వస్తోంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more