ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11వ సీజన్ పై అప్పుడే అభిమానుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సారి ఈ జట్టు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తునే.. వేలం ప్రకటన వరకు అగితే ఇంకాస్త క్లారిటీగా చెబుతామని అంటున్నారు అభిమానులు. కాగా, రెండేళ్ల వేటు తరువాత ఈ సారి సీజన్ పున: ప్రవేశం చేయనున్న రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు కూడా అద్బుతంగా రాణిస్తాయని తమ జట్టుకు వచ్చిన అపఖ్యాతిని పొగొట్టుకునే ప్రయత్నాలు చేస్తాయని అభిమానులు అశిస్తున్నారు.
అయితే అన్నింటిలోనూ అత్యంత కీలకఘట్టమైన అటగాళ్ల వేలం ప్రక్రియపైనే మొత్తంగా అధారపడి వుందన్నది కాదనలేని విషయం. ఈ తరుణంలో ఏ ఆటగాళ్లు ఏ జట్టు తరఫున బరిలోకి దిగుతారో అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. తాజాగా శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, ఆసీస్ క్రికెట్ సారథి డేవిడ్ వార్నర్ లు సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగనున్నట్లు సమాచారం. పదేళ్ల ఒప్పందం ముగియడంతో వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం నిర్వాహకులు ఆటగాళ్లందర్ని వేలంలోకి ప్రవేశపెట్టాల్సి ఉంది.
ఐతే ఫ్రాంఛైజీల యాజమాన్యం కోరిక మేరకు ముగ్గురు క్రికెటర్లను తమ జట్టుతో అట్టిపెట్టుకుని మరో ఇద్దరిని రైట్ టు మ్యాచ్ ద్వారా తిరిగి పొందేలా అవకాశాన్ని కల్పించడంతో హైదరాబాద్ జట్టు డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్ లను అట్టిపెట్టుకోనున్నట్లు సమాచారం. అయితే దీనిపై క్లారిటీ రానుంది. ఈ నిర్ధేశిత తేదీలోగా జట్టు యాజమాన్యాలు ఆటగాళ్ల పేర్లను అందజేయాల్సి వుంది. దీంతో ఈ విషయంలో ఏయే జట్లు ఎవరెవర్ని అట్టిపెట్టుకోనున్నాయి అన్నది స్పష్టత రానుంది.
ఇప్పటికే చెన్నై ధోనీ, రైనాను, ముంబయి రోహిత్ శర్మ, బుమ్రా, హార్దిక్ పాండ్యను తమ వద్దే ఉంచుకోవాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘2016లో హైదరాబాద్ జట్టు ట్రోఫీ అందుకోవడంలో ఈ ముగ్గురు ఆటగాళ్లు కీలకపాత్ర పోషించిన నేపథ్యంలో ఈ ముగ్గుర్నీ తమ వద్దే ఉంచుకోవాలని భావిస్తున్నట్లు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యానికి చెందిన ఓ అధికారి వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more