Azharuddin slams HCA, demands fresh elections హెచ్.సీ.ఏపై టీమిండియా మాజీ కెప్టెన్ చిర్రుబుర్రు..

Azharuddin slams hca demands fresh elections

Indian cricket team, Mohammad Azharuddin, Hyderabad Cricket Academy, HCA, Indian Cricketer, Azharuddin, Justice Lodha Panel, Sports news, latest news, sports, cricket news, cricket

Slamming the Hyderabad Cricket Association (HCA), former Indian cricket team skipper Mohammad Azharuddin demanded fresh elections should be conducted.

హెచ్.సీ.ఏపై టీమిండియా మాజీ కెప్టెన్ చిర్రుబుర్రు..

Posted: 01/13/2018 05:17 PM IST
Azharuddin slams hca demands fresh elections

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై విచారణ జరపాలని భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌ డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... హెచ్‌సీఏ పాలకవర్గం ఎన్నికలలో అక్రమాలకు పాల్పడుతూ హక్కులను ఉల్లంఘిస్తోందన్నారు. చదువుకున్న వ్యక్తులు కూడా ఈ విధంగా వ్యవహరించడం సరికాదని ఆయన అన్నారు. రాజకీయం వేరు క్రికెట్ జీవితం వేరని ఆయన తేల్చిచెప్పారు. తాను రాజకీయంగా యూపీ నుంచి పోటీ చేసినంత మాత్రాన అక్కడే రిజిస్టర్ చేసుకోవాలని చెప్పడం సమంజసం కాదని అన్నారు.

గ్రామీణ క్రీడాకారులకు అవకాశం ఇవ్వడం లేదు. జిల్లా, రూరల్‌ ప్రాంతాల నుంచి కూడా మంచి క్రీడాకారులు ఉన్నారు. హెచ్‌సీఏ నిర్వహించే టీ20 లీగ్‌ అంతా నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోంది. ఆ లీగ్‌కు వివేక్‌ తన తండ్రి పేరు పెట్టడంపై అందరి ఆమోదం తీసుకోలేదు. హెచ్‌సీఏ లోగోతో వివేక్‌ తండ్రి వెంకటస్వామి పేరుతో టీ20 లీగ్‌ నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమే.

ఇక బీసీసీఐ నుంచి తనకు క్లియరెన్స్‌ రాలేదని పాలక వర్గం ఆరోపించిందని అన్నారు. కానీ తనకు హైకోర్టు క్లీన్‌చిట్‌ ఇచ్చిందని.. దానిని నేను బీసీపీఐకి నివేదిక కూడా పంపానని అన్నారు. కోర్టు ఆదేశాలను బయటకు రానీయకుండా హెచ్ సీఏ అధ్యక్షుడు వివేక్‌ తప్పు చేశారు. అలాగే హెచ్‌సీఏ లోథా కమిటీ సిఫార్సులను అమలు చేయడం లేదన్నారు. హెచ్‌సీఏ పాలకవర్గం ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని అజారుద్దీన్ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mohammad Azharuddin  BCCI  Cricket  Hyderabad SGM  Lodha panel  HCA  cricket  

Other Articles