After series, Virat Kohli loses temper విరాట్ కోహ్లీకి నెట్ జనుల చురకలు..

India vs south africa fans unimpressed with arrogant virat kohli in the presser

India vs South Africa, India vs South Africa 2018, India vs South Africa, Virat Kohli, India vs South Africa, 2nd Test, Centurion, IND vs SA live score and updates, Indian national cricket team, Lungi Ngidi, Rohit Sharma, Jasprit Bumrah, sports news, sports, cricket news, cricket, today match, today match score, today match updates

The fans were least impressed with the way Virat answered the questions. Many felt that he was way too ‘arrogant’ and vented out his anger on the journalists.

విరాట్ కోహ్లీకి నెట్ జనుల చురకలు..

Posted: 01/18/2018 08:23 PM IST
India vs south africa fans unimpressed with arrogant virat kohli in the presser

సెంచూరియన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఓటమి అనంతరం కారణాలను విశ్లేషించి మీడియా సమావేశంలో వాటిని వివరించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై నెట్ జనులు విమర్శల జడివాన కురిపిస్తున్నారు. అందుకు కారణం మీడియా సమావేశంలో ఆయన మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేయడమే. దీంతో తమ మీడియాను అందుకున్న నెట్ జనులు కోహ్లీకి చురకలు అంటించారు. ‘దూకుడు కాస్త తగ్గించుకోవాలని, నీ దూకుడు మైదానంలో చూపించు, మైదానం వెలుపల కాదు’ అంటూ ట్వీట్‌ చేశారు.

మీడియా సమావేశంలో ఓ విలేఖరి ‘దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచుల్లో బెస్ట్‌-11తో బరిలోకి దిగారా’ అని ప్రశ్నించడంతో కోహ్లీకి కోపం వచ్చింది. ‘ఏది బెస్ట్‌-11. నేను 34 టెస్టులకు సారథ్యం వహించాను. అందులో 21 విజయాలు ఉన్నాయి. రెండు మాత్రమే పరాజయాలు. కొన్ని డ్రాలు. ఇవన్ని పరిగణనలోకి రావా. ఏది ఏమైనా మేము గెలవడానికే మ్యాచులు ఆడతాము. ఇప్పుడు నేను మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఉన్నాను. ఫైట్‌ చేయడానికి కాదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

దీంతో రంగంలోకి దిగిన నెట్ జనులు విరాట్ కోహ్లీకి చురకలు అంటిస్తూ కామెంట్లు చేశారు. ఆ కామెంట్లు..  కోహ్లీ తన సహనాన్ని కోల్పోయాడు. కోహ్లీకి సవాళ్లు ఎదురవుతున్నాయి. ఓటమిని స్వీకరించడం కోహ్లీ అలవాటు చేసుకోవాలి, ఏదైనా తప్పు చేస్తే ముందు దాన్ని ధైర్యంగా ఒప్పుకోవాలి. కోహ్లీ ఇచ్చిన సమాధానం అతని తెలివితక్కువ తనాన్ని అర్ధం పడుతోంది. చివరి టెస్టులో రహానె, భువనేశ్వర్‌ను ఆడించు, నీ నుంచి ఇలాంటి సమాధానమే వస్తుందని నేను ముందుగానే ఊహించాను. ఇందులో ఏమాత్రం లాజిక్‌ లేదు, అభిమానులారా మహేంద్ర సింగ్‌ ధోనీకి కోహ్లీకి మధ్య తేడా ఏమిటో అర్థమైందా, ఈ దూకుడు మైదానంలో చూపించు, మైదానం వెలుపల కాదు’ అని నెటిజన్లు కోహ్లీకి చురకలు అంటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs South Africa  Centurion Test  Virat Kohli  pandya  rahane  South Africa  cricket  

Other Articles