అండర్-19 ప్రంపచకప్ లో భారత క్రికెట్ జట్టు ఫైనల్ కు చేరింది. సెమీఫైనల్ లో అదరగొట్టిన యువభారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను 203 పరుగులతో చిత్తుచేసింది. ఈ టోర్నీలో అప్రతిహత విజయాలతో దూసుకెళ్తున్న భారత జట్టును సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖులు ప్రశంసించారు. అద్భుతం చేశారంటూ పొగడ్తలతో ముంచెత్తారు. శనివారం ఆస్ట్రేలియాతో జరగబోయే ఫైనల్స్ కు గుడ లక్ చెప్పారు.
* అన్ని విభాగాల్లో ఆధిపత్యాన్ని చూపించి నాణ్యమైన ప్రదర్శన ఇచ్చారు. అద్భుతమైన మ్యాచ్. ఫైనల్ కు ఆల్ ది బెస్ట్ - సచిన్ తెందుల్కర్
* పాకిస్థాన్ తో మ్యాచులో మన అబ్బాయిలు గొప్ప విజయం సాధించారు. బెస్ట్ విషెస్ ఫర్ ఫైనల్స్ - వీరేంద్ర సెహ్వాగ్
* అండర్ -19 అబ్బాయిలు ఎంత మంచి ప్రదర్శన ఇచ్చారు. పాకిస్థాన్ కు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వకుండా తమ ఫీల్డింగ్ లో అందరినీ ఆకట్టుకున్నారు. ఫైనల్ కు గుడ్ లక్ - వీవీఎస్ లక్ష్మణ్
* శుభ్ మన్ గిల్ ది గొప్ప సెంచరీ. భారత క్రికెట్ భవిష్యత్ భద్రంగా ఉంది- మహ్మద్ కైఫ్
* టోర్నీ మొత్తంలో సూపర్ ప్రదర్శన ఇది. కంగ్రాట్స్ టీమిండియా. అరుదైన మైలురాయికి అడుగు దూరంలో నిలిచారు. ప్రపంచకప్ ఫైనల్లో ఆడే అవకాశం ప్రతిరోజు రాదు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి - సురేశ్ రైనా
* నిజమైన ఛాంపియన్లలా ఆడారు. కంగ్రాట్స్ అండర్ -19 టీమిండియా. ఫైనల్ ను కూడా గెలిచేయండి - యూసఫ్ పఠాన్
* పాకిస్థాన్ ను ఎలా ఎదుర్కొంటే భారతీయులు ఇష్టపడుతారో ఈ సెమ ఫైనల్ మ్యాచ్‌లో అండర్ -19 కోచ్ రాహుల్ ద్రవిడ్ చూపించారు - ఐసీసీ
* అదరగొట్టారు. టీం అంతా మంచి ఎఫర్ట్ పెట్టింది. ఇక ప్రపంచకప్ కు అడుగు దూరం మాత్రమే - బీసీసీఐ
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more