Ind vs SA: Rain predicted for fifth ODI వరుణా.. రావద్దు.. చరిత్ర సృష్టించడాన్ని అపోద్దు..

India vs south africa 5h odi visitors keen to seal off but rain worries

5th ODI, Port Elizabeth odi, India vs South Africa, South Africa vs India 2018, virat kohli, Ajinkya Rahane, MS Dhoni, ODI, India v/s South Africa, Ind vs SA, MS Dhoni, Port Elizabeth, chahal, Hardik Pandya, sports news,sports, latest sports news, cricket news, cricket

Rain may play spoilsport again as India look to win the six-match series against South Africa in Port Elizabeth, the bay city South Africa's Eastern Cape Province.

చరిత్రను తిరగరాసే అడుగుదూరంలో అందోళనలో విరాట్ సేన

Posted: 02/12/2018 05:52 PM IST
India vs south africa 5h odi visitors keen to seal off but rain worries

సఫారీ గడ్డపై ఇప్పటి వరకు సాధించని అరుదైన రికార్డును నెలకొల్పే దిశగా దూసుకెళ్లిన టీమిండియా.. అటు ఐసీసీ వన్డే ర్యాంకింగ్లలోనూ అగ్రస్థానాన్ని నిలుపుకోవాలని ఉవ్విళ్లూరుతుంది. ఈ క్రమంలో వరుసగా మూడు వన్డేలను అందుకున్న విరాట్ సేన నాలుగో వన్డేలో మాత్రం వరుణుడు అడ్డంకిగా నిలిచి దక్షిణాఫ్రికాకు విజయాన్ని అందించాడు. ఈ నేపథ్యంలో మరో రెండు మ్యాచులు మాత్రమే మిగిలివున్న క్రమంలో వాటిని కైవసం చేసుకోవాలని భావిస్తున్న టీమిండియా జట్టులో అందోళన రేగుతుంది. మూడు వన్డేలు గెలిచిన విరాట్ సేన ఎందుకు అందోళన చెందుతుందంటారా..?

నాలుగో వన్డేలో ఓటమిపాలు చేసిన వరుణుడు ఐదో వన్డే అటలోనూ ప్రభావాన్ని చాటుతాడా.? అని సందేహిస్తూ అందోళనకు గురవుతుంది. నాలుగో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ మెరుగైన స్కోరునే సాధించినప్పటికీ... వర్షం కారణంగా అగిపోయిన మ్యాచ్ ను డక్ వర్త్ లూయిస్ ప్రకారం సౌతాఫ్రికా జట్టును గెలిచినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఇక ఇదే ఐదో వన్డే లోనూ రిపీట్ అయితే ఎలా అన్న అందోళన కూడా టీమిండియాను వెంటాడుతుంది. పోర్ట్ ఎలిజబెత్ వేదికగా జరగనున్న ఐదో వన్డేలోనూ వరుణుడి శాసనమే అమలుకానుందా..?
 
అంలే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఐదో వన్డే జరిగే ప్రాంతమైన పోర్టు ఎలిజబెత్ లోనూ మంగళవారం వర్షం కురిసే అవకాశాలు వున్నాయని అక్కడి వాతావరణ కేంద్రం అధికారులు సమాచారం అందించడమే విరాట్ సేన అందోళనకు కారణమవుతుంది. మ్యాచ్ మధ్యలో వర్షం పడితే... అది భారత విజయావకాశాలను దెబ్బ తీయవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మ్యాచ్ మొత్తం రద్దైతే అది భారత్ కు అనుకూలంగా మారే అవకాశం ఉంది. అయితే వర్షం పడి మ్యాచ్ మధ్యలో అగిపోతే అప్పడు అమలు చేయాల్సిన ప్రణాళికపై కూడా విరాట్ పథకాలు రచిస్తున్నట్లు సమాచారం, ఇప్పటికే పోర్ట్ ఎలిజబెత్ చేరుకున్న ఇండియన్ ప్లేయర్స్ ప్రాక్టీస్ లో నిమగ్నమయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs South Africa  5th ODI  Port Elizabeth odi  virat kohli  Ajinkya Rahane  MS Dhoni  cricket  

Other Articles