క్రికెట్ చరిత్రలో ఇదో అసాధారణ ఘటన. వన్డే మ్యాచ్ లో గెలుపోటములు సహజం. అయితే పలు సందర్బాలలో మ్యాచులు డ్రాగా కూడా ముగుస్తాయి. ఇలాంటివే ఎప్పుడో ఒక్కసారి జరుగుతాయి. వీటిని ఏ జట్టులోనైనా వేళ్ల మీద లెక్కించవచ్చు. కానీ క్రికెట్ అనగానే ఆసక్తికర ఘటనలు, గణాంకాలు, కొత్త మైలురాళ్లు కూడా చోటుచేసుకుంటాయి. కానీ, రెండు దేశాల మధ్య జరిగిన ఓ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచులో ఏకంగా అసాధారణ గణంకాలు నమోదయ్యాయి. ఎంతలాఅంటే క్రికెట్ ఫాలోవర్స్ ను ఏకంగా అశ్చర్యానికి గురిచేసేలా వున్నాయి ఈ గణంకాలు.
క్రికెట్ చరిత్రలోనే సేమ్ టు సేమ్ గణంకాలు నమోదైన ఏకైక మ్యాచ్ గా నిలిచింది ఈ రెండు జట్ల మధ్య గణంకాలు. జింబాబ్వే, ఆఫ్గనిస్థాన్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ ఈ గణంకాలు నమోదయ్యాయి. ఇక వివరాల్లోకి వెళ్తే.. జింబాబ్వే.. అప్ఘనిస్తాన్ మధ్య వన్డే సిరీస్ కొనసాగుతుంది. తొలి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆఫ్గనిస్థాన్ జట్టు 5 వికెట్ల నష్టానికి 333 పరుగులు చేయగా, జింబాబ్వే జట్టు 10 వికెట్ల నష్టానికి 179 పరుగులు మాత్రమే చేసింది. దీంతో అప్ఘనిస్తాన్ 154 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది.
ఇక రెండో వన్డేలో ప్రతీకారేచ్చతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ తీసుకున్న జింబాబ్వే.. అచ్చంగా అప్ఘనిస్తాన్ తొలి వన్డేలో నమోదు చేసినట్లుగానే 5 వికెట్ల నష్టానికి 333 పరుగులు చేసింది. దీంతో 334 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు కూడా సరిగ్గా తొలి వన్డేలో జింబాబ్వే జట్టు తరహాలోనే 179 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో సిరీస్ 1-1తో సమమైంది. అయితే ఈ రెండు మ్యాచ్ ల్లో నమోదైన గణంకాలు మాత్రం జట్ల పేరును మాత్రమే మార్చుకున్నాయి తప్ప.. మిగిలినదంతా సేమ్ టు సేమ్ గా రిపీట్ అయ్యింది. ఇది క్రికెట్ చరిత్రలో అత్యంత అరుదని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు.
దీంతో ఈ రెండు జట్ల మధ్య నమోదైన పరుగుల గణాంకాలు గతంలో క్రికెట్ చరిత్రలోనే ఎన్నడూ నమోదు కాలేదని వారు అంటున్నారు. ఇక భవిష్యత్తులోనూ ఈ రెండు జట్ల మధ్య నమోదైన గణంకాలు ఏ దేశం జట్ల మధ్య కూడా నమోదవుతాయని కూడా భావించలేమని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకే సిరీస్ లో రెండు వరుస మ్యాచ్ లలో ఈ తరహా పరుగుల అంకెలు కనిపించడం ఇదే తొలిసారని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి అసాధారణ ఘటనలు చోటుచేసుకునేది ఒక్క క్రికెట్ లోనే అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. దట్ ఇజ్ క్రికెట్ అని కూడా చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more