క్రికెట్ ఆట అదృష్టంతో కూడినదని ఇప్పటికీ పలు బలమైన వాదనలు వినబడుతుంటాయి. ఎందుకంటే ఎక్కడ ఎవరికి లక్కు బాగుండి.. లైపులు లభిస్తాయో ఎవరికీ తెలియని విషయమే. ఇక ఒక్కోసారి ఔట్ అయినా అది నో బాల్ గా ప్రకటించే కూడా జరుగుతుంది. అయితే ఈ గేమ్ అంతా అటగాళ్ల చేతుల్లో నైపుణ్యంలో, ఏకాగ్రతలో వుంటుందన్నవారు అంతకు రెట్టింపు సంఖ్యలోనే వున్నారు. కానీ వీరి వాదనలు తప్పు అనే ఘటన ఒకటి తాజాగా జరిగింది.
సాధారణంగా క్రీజులో వున్న బ్యాట్స్ మెన్లు క్లీన్ బౌల్డ్ కావడంతో అవుట్ అవుతుంటారు. దీంతో పాటు క్యాచ్, స్టంప్ అవుట్, రన్ అవుట్ అవుతుంటారు. ఇలా కాకపోతే ఎల్ బీ డబ్యూ కూడా అవుతుంటారు. అయితే ఇవన్నీ కాకుండా కూడా బ్యాట్స్ మెన్ ఔట్ అవుతుంటారు. అయితే ఇది నిత్యం జరిగేది మాత్రం కాదు. ఎప్పుడో కనీసం ఏఢాదికొక్కడి కూడా నమోదవ్వడం కూడా కష్టమే. అదే హిట్ వికెట్. బంతిని అడే క్రమంలో బ్యాట్స్ మెన్ వికెట్లకు తగిలినా.. లేక బ్యాట్ వికెట్లకు తగిలినా అది ఔట్ గానే పరిగనిస్తారు.
కానీ ఇలాంటివేమి లేకుండానే ఓ క్రికెటర్ పెవీలియన్ బాట పట్టాడు. రోటిన్ కు భిన్నంగా ఈ ఔట్ ఇప్పుడు వార్తల్లో నిలించింది. అదెలా అంటే హెల్మెట్ హిట్ వికెట్. అర్థం అయ్యిందా..? బ్యాట్స్ మెన్ తలకు వుండే హెల్మెట్ ఎగిరి వికెట్లకు తగిలి బ్యాట్స్ మెన్ ఔట్ అయిన అరుదైన సంఘటన ఇది. వివరాల్లోకి వెళితే.. టాక్స్ టస్ మ్యాన్ క్రికెట్ టీ 20 ట్రోఫీలో భాగంగా నిన్న అస్టేలియా, న్యూజీలాండ్ మధ్యన జరిగిన మ్యాచ్ లో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది.
న్యూజిలాండ్ బ్యాట్స్ మన్ మార్క్ చాప్మన్.. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆసీస్ బౌలర్ స్టాన్ వేసిన బాల్ హిట్ చేయబోయాడు. ఆ సమయంలో మార్క్ హెల్మెట్ కింద పడింది. అది వెళ్లి వికెట్లపై పడింది. బేల్స్ లేచాయి. అంఫైర్ ఔట్ గా ప్రకటించాడు. క్రికెట్ లో ఇలా కూడా ఔటవుతారా అంటూ ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ ఇలాంటి ఔట్ చూడలేదు అంటున్నారు. దీనిపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more