ప్రస్తుత క్రికెట్ లో అత్యుత్తమ బ్యాట్స్ మెన్ గా రాణిస్తున్న వారు ఎవరంటే చాలా మంది చెప్పే పేరు పరుగుల యంత్రం, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీనే అని చెప్పడంలో సందేహమేమీ లేదు. స్వదేశమనా, విదేశమైనా.. బలమైన ప్రత్యర్థులా.. లేక బలహీన ప్రత్యర్ధులా అన్న తేడా లేకుండా ఎవరిపైనైనా సరే.. బంతులేసిది ఎంతటి బౌలర్ అయినా సరే.. వాటిని అలవోకగా బౌండరీలకు తరలించడంలో ఇప్పుడు విరాట్ ను మించినవారు లేరని చెప్పడం అతిశయోక్తి కాదు.
మరీముఖ్యంగా ఇతర బ్యాట్స్ మెన్లకు సాధ్యం కాని రీతిలో ఛేజింగ్‌లో మెరుగైన ప్రదర్శన చేయడం కోహ్లీ ప్రత్యేకత. ఈ క్రమంలో క్రితం రోజున దక్షిణాప్రికాతో ముగిసిన వన్డే సిరీస్ లో ఏకంగా మ్యాన్ అఫ్ ది మ్యాచ్, మ్యాన్ అప్ ది సిరీస్ కూడా కైవసం చేసుకున్న కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా పలువురు క్రికెట్ అభిమానులు, విశ్లేషకులు, అటగాళ్ల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ జాబితాలో తాజాగా చేరిన మరో ఆటగాడు అప్ఘనిస్తాన్ కు చెందిన రషీద్ ఖాన్. అప్ఘన్ కు చెందిన ఈ స్పిన్ మాంత్రికుడు.. కోహ్లీని అభినందిస్తూ ఆసక్తికర ట్వీట్ చేశాడు. `పరుగుల యంత్రం + శతకాల యంత్రం + ఛేజింగ్ యంత్రం = కోహ్లీ భాయ్. అత్యద్భుత ప్రదర్శన` అని రషీద్ ట్వీట్ చేశాడు. ఇలా రషీద్ ఖాన్ ట్విట్ చేసిన వెనువెంటనే అది కాస్తా వైరల్ గా మారింది. ఇప్పడు టాక్ అప్ ది స్టేడియంగా ఈ ట్విట్ మారింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more