Pooja Vastrakar creates record against australia టీమిండియా క్రికెటర్ సంచలన రికార్డు..

Pooja vastrakar lifts india women to 200 in 1st odi against australia

Australia women's cricket team,Ellyse Perry,Harmanpreet Kaur,Ind vs Aus,India women vs Australia women,India Women vs Australia Women 2018,India Women's Cricket team,live cricket score,live cricket updates,Meg Lanning,Mithali Raj,Women's cricket

Pooja Vastrakar (51) and Sushma Verma (41) under pressure resisted Australia Women, taking India past imminent danger. They added 76 as both registered career-best scores, Pooja notching up her maiden fifty.

టీమిండియా క్రికెటర్ సంచలన రికార్డు..

Posted: 03/12/2018 07:52 PM IST
Pooja vastrakar lifts india women to 200 in 1st odi against australia

స్వదేశంలో పర్యాటక జట్టు ఆస్ట్రేలియాతో జరుగుతున్న పేటీఎం వన్డే సిరీస్ లో భాగంగా ఇవాళ జరిగిన వన్డే మ్యాచులో టీమిండియా క్రికెటర్ తన పేరున సంచలన రికార్డును నమోదు చేసుకుంది. అంతేకాదు పీకల్లోతు కష్టాల్లో వున్న భారత జట్టును గౌరవప్రదమైన స్కోరుకు చేరకునేట్టు కూడా పాటుపడింది. టీమిండియా మహిళ జట్టు క్రికెటర్ పూజా వస్త్రాకర్ ఇవాళ్టి మ్యాచ్ లో అరుదైన ఘనతను అందుకుంది. అయితే టీమిండియా సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్ అనారోగ్యం కారణంగా అమె లేకుండా బరిలోకి దిగిన టీమిండియా జట్టు తొలి వన్డేలో కంగారుల ధాటికి ఓటమిని చవిచూడక తప్పలేదు.

వడోదరలోని రిలయన్స్ స్డేడియం వేదికగా జరిగిన తొలి వన్డేలో అర్థశతకాన్ని నమోదు చేసిన పూజా శస్త్రకర్ ఎలా అరుదైన ఘనతను అందుకుందనేగా మీ డౌట్..? 9వ డౌన్‌ లేదా అంతకంటే తక్కువస్థాయిలో బ్యాటింగ్ కి దిగి అర్థశతంక సాధించిన తొలి భారతీయ మహిళ క్రికెటర్‌గా పూజా శస్త్రకర్ రికార్డు సాధించింది. మ్యాచులో 56 బంతులు ఆడిన పూజా 7 ఫోర్లు, 1 సిక్సుతో 51 పరుగులు చేసింది. దీంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 32.1 ఓవర్లలోనే కేవలం 2 వికెట్లు మాత్రం కోల్పోయి 202 పరుగులు చేసి విజయం సాధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles