పాకిస్థాన్ సూపర్ లీగ్.. రికార్డులతో కాకుండా మైదానంలో ఆటగాళ్ల మధ్య చోటు చేసుకుంటున్న ఘటనలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల అఫ్రిది ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ ను ఔట్ చేసి పెవిలియన్ దారి చూపించి విమర్శలు ఎదుర్కొవడంతో తన ట్విటర్ ఖాతా ద్వారా క్షమాపణలు చెప్పి వార్తలో నిలిచాడు. ఇక తాజాగా ఒకే జట్టు ఆటగాళ్లు కోపంతో ఒకరిపై ఒకరు బంతులు విసురుకోవడం హాట్ టాపిక్ గా మారింది. టోర్నీలో భాగంగా క్వెట్టా గ్లాడియేటర్స్-లాహోర్ క్వాలాండర్స్ మధ్య మ్యాచు జరిగింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన లాహోర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 186 పరుగులు చేసింది. అనంతరం క్వెట్టా బ్యాటింగ్ ప్రారంభించింది. 18 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. దీంతో మరో రెండు ఓవర్లలో 34 పరుగులు చేయాల్సివుండగా, 19వ ఓవర్ వేసేందుకు సోహైల్ ఖాన్ బంతని అందుకుని తొలి బంతిని వైడ్ వేసి.. ఆ తరువాత మూడు బంతులు విసిరాడు. నాలుగో బంతికి ఫీల్డింగ్‌లో మార్పులు చేశాడు. ఈ క్రమంలో బౌండరీ లైన్ వద్ద ఉన్న యాసిర్ షాకు అటుగా జరగమని సోహైల్ సూచించాడు.
అయితే అది గమనించని యాసిర్ పై అగ్రహంతో బంతిని విసిరాడు. అదృష్టవశాత్తూ అది యాసిర్ కు కొద్ది దూరంలో పడింది. దీంతో పట్టరాని కోపంతో ఊగిపోయిన యాసిర్.. తిరిగి సోహైల్ వైపు ఇలా బంతిని విసురుతావా..? అంటూ ప్రశ్నించి.. ఆ తరువాత బలంగా బంతిని సోహైల్ వైపు విసిరాడు. ఇంతలో సహచర ఆటగాళ్లు సర్ది చెప్పడంతో యథావిధిగా ఆట కొనసాగింది. ఈ మ్యాచులో లాహోర్ జట్టు 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆటగాళ్లలో నశిస్తున్న క్రీడా స్ఫూర్తికి ఇది దర్పణం పడుతుందని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Sohail Khan decides if the fielder Yasir Shah won't stand where he wants him to he will just throw the ball at him #PSL2018 #LQvQG pic.twitter.com/8G6C4k5JH1
— Saj Sadiq (@Saj_PakPassion) March 14, 2018
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more