వరల్డ్ కప్ లో సత్తాచాటిన టీమిండియా.. ద్వైపాక్షిక సిరీస్ లో మాత్రం కంగారులతో తడబాటుకు గైరంది. స్వదేశంలో జరుగుతున్నసిరీస్ లో ఒకటి తరువాత మరో మ్యాచులో కూడా ఓటమిని చవిచూసి వరుస పరాజయాలను ఎదుర్కొంది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే అసీస్ జట్టు సిరీస్ ను కైవసం చేసుకుంది. కాగా, భారత మహిళల జట్టు సిరీస్ చేజార్చుకుంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఇవాళ వడోదరలో్ జరిగిన రెండో మ్యాచులో అసీస్ జట్టు టీమిండియా మహిళల జట్టుపై 60 పరుగుల తేడాతో గెలుపోందింది.
టాస్ గెలిచిన తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న భారత జట్టు.. అసీస్ పరుగుల వరదను నిలువరించలేకపోయింది. బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. ఓపెనర్ బోల్టన్(84), పెర్రి(70, నాటౌట్), మూనీ(56) రాణించడంతో ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. భారత బౌలర్ ఏక్తా బిస్త్‌కు 3, పూనమ్ యాదవ్‌కు 2 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత 288 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ తడబడింది. 88 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన భారత్ ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే వికెట్లు కోల్పోతూ వచ్చింది.
ఓపెనర్ స్మృతి మంధాన(67) తప్ప మిగతా వారెవ్వరూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ఫిట్నెస్ సాధించి తిరిగి జట్టులోకి వచ్చిన మిథాలీ రాజ్(15) కూడా నిరాశ పరిచింది. ఆసీస్ బౌలర్ల ధాటికి భారత్ విలవిల్లాడింది. 49.2 ఓవర్లలో 227 పరుగులకే భారత్ కుప్పకూలింది. దీంతో 60 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆసీస్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును బోల్టన్ అందుకుంది. ఇక సిరీస్‌లో నామమాత్రమైన మూడో వన్డే ఆదివారం జరగనుంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more