టీమిండియా పేసర్ మహమ్మద్ షమి చాలా మంచోడని మాజీ కెప్టెన్లు కపిల్ దేవ్, ధోని సహా ఆయనకు పిల్లనిచ్చిన మామ కూడా మద్దతు పలికిన నేపథ్యంలో, ఆయన భార్య హసీన్ జహాన్ మాత్రం తన స్వరాన్ని మార్చడం లేదు. ఈ క్రమంలో అమె షమీపై రోజుకో అరోపణ చేస్తూనే వుంది. అవి కాస్తా సంచలనంగా మారుతూనే వున్నాయి. ఈ క్రమంలో ఆయనపై పోలీసు కేసుతో పాటు ఐటీ దాడులు కూడా జరిగినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో షమి స్పందించాడు. హసీన్ కు ముందే మరో వ్యక్తితో పెళ్లి అయిన విషయాన్ని దాచి తనను పెళ్లాండిందని తెలిపాడు.
తాను హసీన్ జహాన్ ను పెళ్లి చేసుకునేటప్పటికే ఆమెకు మరొకరితో పెళ్లి అయ్యింది. అప్పటికే ఇద్దరు ఆడ పిల్లలు కూడా ఉన్నారు షమీ అరోపించాడు. అయితే ఈ విషయం తన వద్ద దాచి పెళ్లి చేసుకుందని అన్నాడు. పిల్లలు ఎవరన్న అనుమానంతో తాను అమెను అడిగితే.. చనిపోయిన తన సోదరి పిల్లలు అని చెప్పిందని.. అమె మాటలను గుడ్డిగా నమ్మిన తాను అమెను పెళ్లి చేసుకున్నానని అన్నాడు. ఆ తర్వాత కొంత కాలానికి హసీన్ అసలు విషయం చెప్పిందని అమెకు షఫీయుద్దీన్ అనే వ్యక్తితో పెళ్లి అయ్యిందని, ఆ పిల్లలు తన పిల్లలే అని చెప్పడంతో తాను షాక్ అయ్యానని షమి తెలిపాడు.
2002లో హసీన్.. షఫీయుద్దీన్ అనే వ్యక్తిని పెళ్లాడిందని అయితే.. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత అమెకు తన మొదటి భర్తతో విభేదాలు తలెత్తాయని, దీంతో అతనితో 2010లో విడిపోయి తన తల్లిదండ్రుల వద్దకు చేరిందని అన్నాడు. కాగా, తనకు హసీన్ తో 2012లో పరిచయం ఏర్పడిందని, అది క్రమంగా పరిణయానికి దారి తీసిందని చెప్పాడు. దీంతో 2014లో అమెను పెళ్లి చేసుకున్నానని.. ప్రస్తుతం నాకు ఒక పాప కూడా వుందని చెప్పాడు. పాప భవిష్యత్ విషయంలో ఇన్నాళ్లు అగానని.. అయితే ఇక అమెతో కలసి జీవించడం కుదరదని తేల్చిచెప్పాడు. హసీన్ ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు షమీపై గృహహింస, అత్యాయత్యం కేసును ఎలా దర్యాప్తు చేస్తారో..? వారి విచారణలో ఏమి తేలుతుందో వేచిచూడాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more