ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇవాళ తొలి మ్యాచ్ ను అడనుంది. అయితే ఈ జట్టు సారథ్య బాధ్యతలను ఇన్నాళ్లు చేపట్టిన డేవిడ్ వార్నర్.. ఈ సారి జట్టుకు దూరమైన నేపథ్యంలో తన జట్టు బృందానికి మంచి సందేశం పంపించాడు. తొలి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ తో ఇవాళ ఎనమిది గంటలకు హైదరాబాదులోని ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచులో సన్ రైజర్స్ బాగా అడాలని విజయాన్ని అందుకోవాలని కాంక్షిస్తూ.. డేవిడ్ వార్నర్ ఈ సందేశాన్ని తన సామాజిక మాద్యమం ద్వారా పోస్టు చేశాడు.
డేవిడ్ వార్నర్‌ని ఐపీఎల్ నుంచి బహిష్కరించడంతో ఈసారి కేన్ విలియమ్సన్ జట్టు సారథ్య బాధ్యతలు స్వీకరించాడు. వార్నర్ స్థానంలో అలెక్స్ హేల్స్‌కి జట్టులో చోటు కల్పించారు. అయితే ఐపీఎల్ కి దూరమైన వార్నర్ మనసు మొత్తం హైదరాబాద్ జట్టు మీదే ఉంది. సన్‌రైజర్స్ జెర్సీ అవిష్కరణ కార్యక్రమాన్ని ఇన్ స్టాగ్రామ్ లో లైవ్ స్ట్రీమింగ్ పెట్టారు. అక్కడ డేవిడ్ వార్నర్ తన తోటి క్రికెటర్లకు శుభాకాంక్షలు చెప్తూ కామెంట్ చేశాడు. అంతేకాక.. ఐపీఎల్ చూసేందుకు ఇండియా వస్తానని పేర్కొన్నాడు.
తాజాగా హైదరాబాద్ జట్టుకు శుభాకాంక్షలు చెబుతూ వార్నర్ ట్వీట్ చేశాడు. ‘‘గుడ్ లక్ టు మై ఫ్రెండ్స్ సన్ రైజర్స్.. ఈ రాత్రి మంచిగా ఆడండి’’ అంటూ సన్ రైజర్స్‌కి వార్నర్ తన సందేశాన్ని అందించాడు. ఈ ట్వీట్ పై నెటిజన్లు ‘వి మిస్ యూ వార్నర్’ అంటూ కామెంట్ చేస్తున్నారు. వార్నర్ సారథ్యంలో 2016 ఐపీఎల్ లో సన్‌రైజర్స్ విజేతగా నిలిచింది. అయితే సౌతాఫ్రికాలో జరిగిన బాల్ ట్యాంపరింగ్ ఉదంతం కారణంగా వార్నర్, స్మిత్‌లను క్రికెట్ ఆస్ట్రేలియా బహిష్కరించడంతో వాళ్లను ఐపీఎల్ నుంచి కూడా నిషేధించారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more