తాను టెస్టు క్రికెటర్ అన్న ముద్ర నుంచి బయటపడేందుకు ఐపీఎల్ చాలా దోహదపడుతుందని టీమిండియా బ్యాట్స్ మెన్, ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓపెనర్ కేఎల్ రాహుల్ అశాభావం వ్యక్తం చేశాడు. క్రితం రోజు ఢిల్లీ డేర్ ఢెవిల్స్ తో జరిగిన మ్యాచులో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడి ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ నమోదు చేసిన రాహుల్.. 14 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో వీర విహారం చేసి జట్టుకు తొలి విజయాన్ని అందించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. భారీ విజయ లక్ష్యం ముందుండడంతో దూకుడుగా ఆడాలని ముందే నిర్ణయించుకున్నట్టు చెప్పాడు. అయితే, ఇంత గొప్పగా ఆడతానని మాత్రం తానే అనుకోలేదన్నాడు. ఓపెనర్ గా దిగుతున్నాను కాబట్టి వీలైనంత బాగా ఆడాలని, ఎదుర్కొనే ప్రతి బంతినీ పరుగుగా మార్చాలని అనుకున్నానని వివరించాడు. అయితే, అనుకున్న దానికంటే బాగా ఆడానని, ఇదే ఫామ్‌ను మిగతా మ్యాచుల్లోనూ కొనసాగిస్తానని చెప్పాడు. ఐపీఎల్ లోనే అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ సాధించానని చెప్పుకొచ్చాడు.
రాహుల్ ప్రదర్శనకు తాజా, మాజీ క్రికెటర్లు ముగ్ధులైపోయారు. రాహుల్ ఆటతో జట్టుకు మంచి శుభారంభం లభించిందని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. మ్యాచ్ అన్నాక గెలుపోటములు సహజమని పేర్కొన్న సాహా, రాహుల్ రికార్డు అర్ధ సెంచరీ సాధించడం, షమీ ఢిల్లీ తరపున ఆడడం తనకు సంతోషాన్ని ఇచ్చిందన్నాడు. పంజాబ్ జట్టు కెప్టెన్ అశ్విన్ కు మంచి ఆరంభం లభించిందని మహమ్మద్ కైఫ్ ట్వీట్ చేశాడు. రాహుల్ అవుట్ స్టాండింగ్ ఇన్నింగ్స్ ఆడాడని కొనియాడిన ఇర్ఫాన్ పఠాన్ 13 బంతుల్లోనే మరో అర్ధ సెంచరీ సాధించేందుకు ప్రయత్నించాలని సూచించాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more