Mumbai Indians Suffer Another Loss In IPL బ్యాటింగ్ మరింత మెరుగుపడాలి: రోహత్ శర్మ

Ipl 2018 our batsmen should have done better says rohit sharma

rohitsharma, mumbaiindians, no-hit sharma jokes, rohitsharma trolled, rohit poor form, mumbaiindians captain, sunrisershyderabad, rohitipl record, mumbaiipl standings, ipl points table, ipl 2018, ipl 11, fans troll rohit, indian premier league, sports, cricket

After suffering their second loss in the ongoing IPL, Mumbai Indians skipper Rohit Sharma felt that his side wasn't able to put a fighting total against Sunrisers Hyderabad.

బ్యాటింగ్ మరింత మెరుగుపడాలి: రోహత్ శర్మ

Posted: 04/13/2018 04:02 PM IST
Ipl 2018 our batsmen should have done better says rohit sharma

హైదారబాద్ వేదికగా సాగిన రెండో మ్యాచులో రమారమి విజయపుటంచుల వరకు చేరని ముంబై ఇండియన్స్ జట్టు చిట్టచివరి బంతి ముందు బోర్లాపడటం తనను తీవ్రంగా కలచివేస్తోందని ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమి పాలవడం బాధగా ఉందన్నాడు. విజయం ఖాయమన్న మ్యాచులను ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్టు చెప్పాడు. తమ జట్టు బ్యాటింగ్ తీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేశాడు.
 
ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్లో ఓటమి తరువాత రోహిత్ శర్మ మాట్లాడుతూ.. మంచి స్కోర్లు సాధించలేకే రెండు మ్యాచుల్లోనూ ఓడిపోయినట్టు చెప్పాడు. ఇంకొన్ని పరుగులు చేయాల్సి ఉండేందని, తమ బ్యాట్స్ మెన్ ఇంకొంత మెరుగ్గా ఆడి ఉండాల్సిందని అన్నాడు. బౌలర్లు చక్కగా బౌలింగ్ చేసినా, బ్యాట్స్ మెన్ వైఫల్యమే తమ ఓటమికి ప్రధాన కారణమన్నాడు. బౌలర్లు రాణించారని, గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నించారని ప్రశంసించాడు. ఒకానొక దశలో విజయం తమ చేతుల్లోకి వచ్చినా అదృష్టం కలిసి రాకే ఓడిపోయినట్టు చెప్పాడు. పరాజయం తమను నిరాశకు గురిచేసినా యువ క్రికెటర్ల ఆట మాత్రం ఆకట్టుకుందన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ipl  IPL 2018  Mumbai Indians  rohit sharma  sunrisers hyderabad  

Other Articles