ఐపీఎల్ వేలంలో టీమిండియా అటగాడు ఇషాంత్ శర్మకు చేధు అనుభవం ఎదురుకావడంతో అతను తానేంటో.. తన సత్తా ఏంటో అన్నది ఏకంగా కౌంటీ క్రికెట్ లో నిరూపించుకున్న ఆయనకు చారిత్రాత్మక టెస్టు మ్యాచ్ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐపీఎల్ లో తనను పక్కనబెట్టడంతో కౌంటీ క్రికెట్ ఆడేందుకు ఇంగ్లాండ్ వెళ్లిన ఇషాంత్.. అక్కడ ససెక్స్ జట్టు తరఫున ఆడుతూ గాయాల బారిన పడ్డాడు. దీంతో త్వరలో అఫ్గానిస్థాన్‌తో జరిగే ఏకైక టెస్టుకు ఇషాంత్ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే ఐపీఎల్ లో కుడి చేతి వేలికి గాయం కావడంతో వికెట్ కీపర్ సాహా ఈ టెస్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో దినేశ్ కార్తీక్ ను తీసుకుంది జట్టు యాజమాన్యం. ఇప్పుడు ఇషాంత్ శర్మపై అనుమానాలు నెలకొన్నాయి. తాజాగా అతడు గాయం కారణంగా ఎసెక్స్ తో మ్యాచ్ కు దూరమయ్యాడు. ఇషాంత్ విషయంలో ఇలా జరగడం ఇది రెండోసారి. భుజం గాయం కారణంగా ఇంతకు ముందు మిడిలెక్స్ తో మ్యాచ్ కు ఇషాంత్ దూరం కావాల్సి వచ్చింది. నాలుగు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఇషాంత్ 15 వికెట్లను దక్కించుకున్నాడు.
ఇక రాయల్ లండన్ తరఫున వన్డే కప్‌లో 6 మ్యాచ్‌లాడిన అతడు 8 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. జూన్ 14న భారత్-అఫ్గానిస్థాన్ మధ్య బెంగళూరులో జరగనున్న ఏకైక టెస్టుకు జట్టు యాజమాన్యం అతన్ని ఎంపిక చేసింది. మరో వారం రోజులు మాత్రమే మిగిలివున్న నేపథ్యంలో ఇషాంత్.. ఇంగ్లాండ్ నుంచి భారత్ చేరుకోవాల్సి ఉంది. అంతేకాదు అఫ్గానిస్థాన్ టెస్టు కోసం బీసీసీఐ ఎంపిక చేసిన భారత జట్టు బృందం త్వరలో యో యో టెస్టులో కూడా పాల్గొనాల్సి ఉంది. ఈ టెస్టులో వచ్చిన ఫలితం ఆధారంగానే ఇషాంత్ ఆడతాడో? లేదో? తేలనుంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more