అఫ్గానిస్థాన్ తో జరగనున్న చారిత్రక టెస్టు మ్యాచ్ లో ఆడబోతుండటాన్ని ఓ అరుదైన గౌరవంగా భావిస్తున్నానని భారత జట్టు తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానె అభిప్రాయపడ్డాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా గురువారం నుంచి ఈ టెస్టు ప్రారంభం కానున్న క్రమంలో దీనిపై మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిచ్చిన రహానే ఈ టెస్టుకు బిసిసిఐ కూడా మంచి క్రికెటర్లను ఎంపిక చేసిందని అన్నారు. ఈ జట్టులో కొందరు టాలెంటెడ్ అటగాళ్లు కూడా వున్నారని అభిప్రాయపడ్డారు. పలువురు క్రికెటర్లు ఇప్పటికే తమ సత్తా ఏంటో కూడా పలు సందర్భాలలో నిరూపించుకున్నారని అన్నాడు.
ఇటీవల టెస్టు హోదా దక్కించుకున్న అఫ్గానిస్థాన్ జట్టు భారత్‌తోనే తొలి టెస్టు ఆడనున్న విషయం తెలిసిందే. ఇంగ్లాండ్‌లో కౌంటీలు ఆడేందుకు ఈ టెస్టు నుంచి రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి తప్పుకోగా.. అతని స్థానంలో కెప్టెన్‌గా రహానె ఎంపికయ్యాడు. అయితే.. ఐపీఎల్‌లో గాయపడిన కోహ్లి.. కౌంటీల నుంచి కూడా తప్పుకుని ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. మ్యాచ్ ప్రారంభసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘అఫ్గానిస్థాన్ తొలి టెస్టులో ఆడబోతుండటాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఇది ఆ జట్టుకి ఓ చారిత్రక ఘటన అని పేర్కోన్నారు.
ఇక ఈ జట్టులో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉంది. అఫ్గానిస్థాన్ జట్టులో చాలా మంది ప్రతిభ ఉన్న ఆటగాళ్లున్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో తామేంటో ఇప్పటికే వారు నిరూపించుకున్నారు. కచ్చితంగా టెస్టు క్రికెట్‌లో కూడా ఆ స్థాయి ప్రదర్శనని కనబర్చేందుకు ప్రయత్నిస్తారు’ అని అజింక్య రహానె వెల్లడించాడు. గాయం కారణంగా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా జట్టు నుంచి తప్పుకోగా.. అతని స్థానంలో దినేశ్ కార్తీక్‌ని సెలక్టర్లు ఎంపిక చేశారు. కోహ్లి స్థానంలో కరుణ్ నాయర్ ఈ టెస్టు మ్యాచ్ ఆడనున్నాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more