bjp-may-nominate kapil-dev-for-rajya-sabha రాజ్యసభకు నామినేషన్ కు మరో క్రికెట్ దిగ్గజం..

Bjp may nominate madhuri dixit kapil dev for rajya sabha

Rajya Sabha, nominate, Monsoon Session, madhuri dixit, Kapil Dev, BJP, Amit Shah, PM Modi, sachin tendulkar, politics

The BJP has reportedly considered 10-12 names to nominate into the Rajya Sabha, which include film star Madhuri Dixit, former cricket captain Kapil Dev, and Marathi playwright Babasaheb Purandare, the Hindu reported.

మరో క్రికెట్ లెజెండ్ కు రాజ్యసభ సభ్యత్వం..

Posted: 06/27/2018 07:03 PM IST
Bjp may nominate madhuri dixit kapil dev for rajya sabha

క్రికెట్ దేవుడిగా ఖ్యాతిగడించిన సచిన్ టెండూల్కర్ తో నూతన అధ్యాయానికి అప్పటి యూపీఏ ప్రభుత్వం తెరలేపగా, అదే బాటలో ఇప్పటి ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఫాలో అవుతుంది. మరో లెజెండరీ క్రికెటర్ త్వరలోనే పెద్దల సభలో అడుగుపెట్టనున్నాడా? ఈ మేరకు సంప్రదింపులు జరుగుతున్నాయా? అంటే ఔననే అంటున్నాయి మీడియా వర్గాలు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రఖ్యాత ఆల్ రౌండర్ కపిల్ దేవ్ రాజ్యసభకు నామినేట్ కాబోతున్నారు. రాష్ట్రపతి ఎంపిక చేసే వారి జాబితాలో కపిల్ దేవ్ పేరు ఉండబోతోందని మీడియా వర్గాలు బొగ్గట్టా.

ఈ మేరకు కేంద్రంలోని అధికార బీజేపి పార్టీ చొరవ చూపుతున్నట్టుగా వార్తలు అందుతున్నాయి. రాష్ట్రపతి ఎంపిక చేసే రాజ్యసభ సభ్యులు కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అభిప్రాయానికి అనుగుణంగా ఉండటం సంప్రదాయం. ఈ నేపథ్యంలో కపిల్ దేవ్‌ను పెద్దల సభకు పంపాలని భారతీయ జనతా పార్టీ భావిస్తున్నట్టుగా ఆ పత్రిక కథనంలో పేర్కొంది. ఇటీవలే బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కపిల్ దేవ్ ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే.

ఆ సమయంలో రాజ్యసభ సభ్యత్వం ప్రస్తావన వచ్చిందని.. కపిల్‌కు షా ఆ హామీ ఇచ్చారని ఆ పత్రిక పేర్కొంది. కేవలం కపిల్ దేవ్‌ను మాత్రమే కాదు, మరో సెలబ్రిటీని కూడా షా కలిశారు. బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ ఇంటికి వెళ్లి షా సమావేశం అయ్యారు. ఆమెకు కూడా రాజ్యసభ సభ్యత్వ హామీని ఇచ్చారని... రాష్ట్రపతి కోటాలో నామినేట్ అయ్యే రాజ్యసభ సభ్యుల్లో మాధురీ దీక్షిత్ పేరు కూడా ఉండబోతోందని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajya Sabha  nominate  Monsoon Session  madhuri dixit  Kapil Dev  BJP  Amit Shah  PM Modi  sachin tendulkar  politics  

Other Articles