దేశ రాజకీయాలలో నకిలీ డిగ్రీ సర్టిఫికేట్స్ ఓ వైపు ఇప్పటికీ తెగని సమస్యగా మారగా, అదే ఫేక్ సర్టిఫికేట్స్ వ్యవహారంలో చిక్కుకున్న ఓ క్రీడాకారిణికి మాత్రం పదవి కోల్పోయేలా చేసింది. అమె సమర్పించిన ధృవపత్రాలు నకిలీవని తేలడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అమెను డీఎస్సీ స్థాయి నుంచి కానిస్టేబుల్ స్థాయికి డిమోట్ చేసింది. ఇంతకీ అమె ఎవరంటారా.. భారత మహిళల టీ20 జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్..
ఆమెకు డీఎస్పీ హోదాని తొలగిస్తూ పంజాబ్ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.
గత ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగిన మహిళల ప్రపంచకప్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత శతకంతో భారత జట్టుని ఫైనల్‌కి చేర్చింది. దీంతో.. ఆమెకి అప్పట్లో పంజాబ్ ప్రభుత్వం పోలీసు శాఖలో డీఎస్పీ జాబ్‌ని ఆఫర్ చేయగా.. ఈ ఏడాది మార్చి 1న ఈ క్రికెటర్ బాధ్యతలు స్వీకరించింది. కానీ.. ఆ సమయంలో సమర్పించిన డిగ్రీ సర్టిఫికేట్స్ నకిలీవని తాజాగా పంజాబ్ పోలీసులు తేల్చారు. 2011లో చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీ నుంచి తాను డిగ్రీ పాసైనట్లు హర్మన్‌ప్రీత్ కౌర్ పోలీసు శాఖకి సర్టిఫికేట్స్ సమర్పించింది. కానీ.. విచారణలో అవి నకిలీవని తేలింది.
దీంతో.. ఇక నుంచి హర్మన్‌ప్రీత్‌ని 12వ తరగతి మాత్రమే పాసైనట్లుగా పంజాబ్ ప్రభుత్వం చూస్తుందని.. ఆమె అర్హతకి పోలీసు శాఖలోనే కానిస్టేబుల్ ఉద్యోగం (ఆమె ఒప్పుకుంటే) ఇవ్వనున్నట్లు ఓ అధికారి తెలిపారు. నకిలీ సర్టిఫికేట్స్ సమర్పించినప్పటికీ.. హర్మన్‌ప్రీత్ అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదని ఆయన వివరించారు. హర్మన్‌ప్రీత్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే.. ఇప్పటికే ఆమె అందుకున్న అర్జున అవార్డుని కూడా కోల్పోవాల్సి వస్తుంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more