టీమిండియా మాజీ క్రికెటర్, స్పిన్నర్ రమేశ్ పవార్ కు భారత క్రికెట్ జట్టు కోచ్ బాధ్యతలను తాత్కాలిక ప్రాతిపదికన అందజేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. మరి రవిశాస్త్రీకి ఏం చేస్తాడు.. ఆయన లీవ్ లో వెళ్తున్నారా..? అన్న సందేహాలు మీ మదిని తొలుస్తున్నాయా.. అంతలా అలోచించకండీ.. ఎందుకంటే రమేష్ పవార్ విరాట్ సేను తాత్కలిక కోచ్ గా రావడం లేదు. పవార్ మిధాలీసేనకు.. అంటే భారత మహిళల క్రికెట్ జట్టుకు.
కొద్ది రోజుల క్రితం భారత్ మహిళల జట్టు కోచ్ తుషార్ ఆరోథ్ ఈ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సీనియర్ క్రీడాకారిణులు కోచ్ పద్ధతి సరిగా లేదంటూ బీసీసీఐకి ఫిర్యాదు చేయడంతో తుషార్ రాజీనామా చేశారు. దీంతో మహిళల జట్టుకు తాత్కాలిక కోచ్‌గా మాజీ క్రికెటర్ రమేశ్ పవార్‌ను ఎంచుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. జులై 25 నుంచి బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో మిథాలీ సేన శిక్షణ తీసుకోనుంది. అప్పటి నుంచే రమేశ్ జట్టుతో కలవనున్నాడు. ‘బీసీసీఐ ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతలు నాకు అప్పగించింది. ఎంతో సంతోషంగా ఉంది. భారత జట్టు మంచి విజయాలు సాధించేలా కృషి చేస్తా’ అని పవార్ తెలిపారు.
‘వచ్చే నెలలో భారత మహిళల జట్టుకు పూర్తి స్థాయి కోచ్‌ను ఎంపిక చేస్తాం. ఇందుకోసం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేశాం. జాతీయ జట్టు లేదా రాష్ట్రానికి చెందిన ఫస్ట్ క్లాస్ జట్టుకు కోచింగ్ బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఉన్న 55 సంవత్సరాలలోపువారు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చిన బీసీసీఐ తెలిపింది. ఈ నెల 20లోగా దరఖాస్తులు పంపాలని సూచించింది. రమేశ్ పవార్ భారత్ తరఫున 2 టెస్టులు, 31 వన్డేలు ఆడారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more